Begin typing your search above and press return to search.
గులాబీకి గుడ్ బై.. కాంగ్రెస్ లోకి జూపల్లి?
By: Tupaki Desk | 4 Feb 2020 9:51 AM GMTజూపల్లి కృష్ణారావు.. మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత.. కేసీఆర్ మొదటి కేబినెట్ లో మంత్రిగా చక్రంతిప్పి రెండోసారి ఓడిపోయి కనుమరుగయ్యాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి.. మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తాచాటాడు... ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లో పోయిన తన ప్రతిష్టను తాజా మున్సిపల్ ఎన్నికలతో మరోసారి నిరూపించాడు.తన సొంతింట బలవంతుడనని నిరూపించాడు.
కొల్లాపూర్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కడంతో జూపల్లి డమ్మీ అయిపోయారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన వర్గానికి టీఆర్ఎస్ టికెట్లు దక్కలేదు. విధిలేని పరిస్థితుల్లో జూపల్లి టిఆర్ఎస్ పై తిరుగుబాటు చేశాడు. తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ రెబల్స్ గా పోటీచేసి 11 మందిని గెలిపించాడు. కొల్లాపూర్ మునిసిపాలిటీని గెలుచుకున్నాడు. ఇక్కడ అధికారిక టిఆర్ఎస్ కేవలం 9 సీట్లే గెలుచుకొని ఓడిపోయింది. కాంగ్రెస్ నుంచి వచ్చి టీఆర్ఎస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కంటే తనకే బలమైన ప్రజాదరణ ఉందని మున్సిపల్ ఎన్నికలతో కెసిఆర్, కెటిఆర్‌లకు జూపల్లి చూపించారు.
అయితే కేసీఆర్ మాత్రం జూపల్లికి షాకిచ్చారు. తిరుగుబాటు చేసిన జుపల్లిని పార్టీలోకి తీసుకోలేదు. 11 మంది తిరుగుబాటుదారుల మద్దతును తీసుకోవాలని కేసీఆర్ ను కోరినా తిరస్కరించడంతో జూపల్లి ఎటూకాకుండా అయిపోయారు. ఎక్స్-అఫిషియో సభ్యులతో కొల్లాపూర్ మున్సిపాలిటీ ని కేసీఆర్ గెలుచుకున్నారు. ఈ విధంగా, 11 సీట్లు గెలిచినప్పటికీ, జూపల్లి వర్గం మున్సిపాలిటీని గెలుచుకోలేదు. అటు అధికార టీఆర్ఎస్ లోనూ చేరకుండా ఎటూకాకుండా అయిపోయింది.. టీఆర్ఎస్ లో చేరుతామని జూపల్లి ఇటీవల కెసిఆర్ అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ గులాబీ దళపతి ఇవ్వడానికి నిరాకరించాడు. రెండు రోజులకు పైగా వేచి ఉన్నప్పటికీ, కెసిఆర్ ను కృష్ణారావు కలవ లేకపోయాడు. దీంతో జూపల్లి ని టీఆర్ఎస్ పక్కన పెట్టినట్టైంది.
టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసిన జూపల్లి రాజకీయ భవిష్యత్ ప్రస్తుతం గందరగోళంలో పడింది. టిఆర్‌ఎస్ అతన్ని కోరుకోవడం లేదు, బిజెపికి వెళ్లడానికి జూపల్లికి ఆసక్తి లేదు. ఇప్పుడు ఆయనకు అందుబాటులో ఉన్న ఏకైక ఎంపిక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అతను మొదట కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు.. ఇప్పుడు తిరిగి సొంతగూటికి వెళ్లడమే ఆయన ముందున్న కర్తవ్యం.. ప్రస్తుతం ఆదరించని టీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి తిరిగి రావడానికి జూపల్లి చర్చలు జరుపుతున్నాడు. మరి కాంగ్రెస్ లో ఆయన ప్రయాణం సజావుగా సాగుతుందా? కాంగ్రెస్ లో చేరుతాడా అన్నది ఆసక్తిగా మారింది.