Begin typing your search above and press return to search.
మిస్టర్ రావుల..అసెంబ్లీ దగ్గర జూపల్లి వెయింటింగ్!
By: Tupaki Desk | 13 July 2015 4:46 AM GMTసవాళ్లు..ప్రతిసవాళ్లు విసురుకోవటం.. విమర్శలు చేసుకోవటం.. ఆరోపణలు సంధించుకోవటం రాజకీయాల్లో మామూలే. అధికారపక్షాన్ని విపక్షం.. విపక్షాన్ని అధికార పక్షం దుమ్మెత్తిపోయటం మామూలే. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు.. టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిలకు పాలమూరు ఎత్తిపోతల పథకంపై గత కొద్దిరోజులుగా వాదులాట జరగటం తెలిసిందే.
ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని.. ముఖాముఖి చర్చకు వస్తారా అంటూ సవాలు విసురుకున్నారు. రావుల సవాలుకు ఎక్కడికైనా వస్తానని చెప్పటం.. దానికి ఎన్టీఆర్ భవన్ వద్దకు రావాలని చెప్పిన రావుల.. చెప్పినట్లే అక్కడ వెయిట్ చేయటం జరిగింది. ఎక్కడికైనా వస్తానని చెప్పిన జూపల్లి.. తాను వెయిట్ చేసినా రాలేదంటూ రావుల వ్యాఖ్యానించటం దీనికి కౌంటర్‌గా.. సోమవారం అసెంబ్లీ వద్దకు వస్తానని ఆదివారం మంత్రి జూపల్లి పేర్కొనటం తెలిసిందే.
ఇలా ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటూ పుణ్యకాలం గడిపేస్తారన అనుకునే వాళ్లకు షాకిస్తూ.. మంత్రి జూపల్లి.. తన సహచర మంత్రి లక్ష్మారెడ్డి..మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి వచ్చి అసెంబ్లీ దగ్గర వెయిట్ చేయటం ఒక్కసారి వాతావరణ వేడెక్కింది.
తాను అసెంబ్లీ దగ్గర వెయిట్ చేస్తున్నానని.. పాలమురు మీదకు చర్చకు వస్తానని చెప్పిన రావుల ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
దీంతో.. రావుల గురించి ఆరా తీస్తే.. ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీలో ఉన్నారని చెబుతున్నారు. అసెంబ్లీ దగ్గర మంత్రి జూపల్లి ఎంతసేపు వెయిట్ చేస్తారో..? అన్నది ఒక ప్రశ్న అయితే.. జూపల్లి వెళ్లే లోపు రావుల వస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.