Begin typing your search above and press return to search.

తెలుగు మంత్రికి రూ.50 కోట్ల లంచం

By:  Tupaki Desk   |   13 Feb 2017 3:22 PM GMT
తెలుగు మంత్రికి రూ.50 కోట్ల లంచం
X
కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ డిజైన్ మార్పు వెనుక ముడుపుల కోణం ఉందని ఆరోపించారు. ప్రాజెక్ట్ కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీ(నవయుగ)కి అనుకూలంగా మంత్రి జూపల్లి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3కమిటీలు పంప్ హౌస్ డిజైన్ ను మార్చవద్దని నివేధించినప్పటికి 4వ కమిటీ వేసి డిజైన్ లు మారుస్తున్నారని పేర్కొంటూ ఉపరితల పంప్ హౌస్ నుంచి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ గా డిజైన్ మారుస్తున్నారని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. ఈ డిజైన్ మార్పు వల్ల అదనంగా వెయ్యి కోట్లు భారం పడుతుందని తెలిపారు.

త‌న‌కు ముడుపుల కోసమే మంత్రి జూపల్లి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంపు హౌస్ డిజైన్ మారుస్తున్నారని వంశీచంద్‌ రెడ్డి ఆరోపించారు. జిల్లా కలెక్టర్ అటవీ భూముల కోసం 700ల ఎకరాలు సేకరించినప్పటికి ఫారెస్టు ఏరియా పేరుతో పంప్ హౌస్ డిజైన్ ను మార్చడం సరికాదని అన్నారు. నవయుగ కాంట్రాక్టు ఏజెన్సీ నుంచి ముడుపులు తీసుకునే మంత్రి జూపల్లి డిజైన్ మారుస్తున్నారని, పంప్ హౌస్ డిజైన్ మార్పు సరికాదన్న నిపుణుల కమిటీ రిపోర్టుల పై మంత్రి జూపల్లి బహిరంగ చర్చకి సిద్ధపడాలని వంశీచంద్ రెడ్డి స‌వాల్ విసిరారు. ఆ రిపోర్టులు తప్పని మంత్రి రుజువు చేస్తే నేను ముక్కు నేలకు రాస్తాన‌ని వంశీచంద్ రెడ్డి ప్ర‌క‌టించారు. బహిరంగ చర్చకు తేది వేదికను మంత్రి కృష్ణారావే ఖరారు చేయాలని అన్నారు.

కాగా, వంశీచంద్ రెడ్డి ఆరోప‌ణ‌ల‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు రేవంత్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. రేవంత్, వంశీ లాంటి ల‌ఫూట్ గాళ్లతో బహిరంగ చర్చకు వస్తామా అని వ్యాఖ్యానించారు. బహిరంగ చర్చకు వెళ్లాలంటే కొన్ని స్టాండర్డ్స్ కావాలని ఎద్దేవా చేశారు. డబ్బు సంచులు మోసే అలవాటున్న రేవంత్ తదితరులు ప్రజాపోరు పేరిట యాత్రలు చేయడం విడ్డూరమ‌ని జూప‌ల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ కలిసిరాని దద్దమ్మలు టీటీడీపీ నేతలని, ప్ర‌స్తుతం చంద్రబాబు కోసం ప్రజా పోరు యాత్ర చేస్తున్నట్టుందని ఉద్యమంలో ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమని చాలామంది లేఖలు రాసి చనిపోయారని తెలిపారు. వంశీచంద్ ,రేవంత్ లు పలక బలపం పట్టుకుని స్కూల్ కెళ్ళి పాఠాలూ నేర్చుకోవాల‌ని వంశీచంద్ రెడ్డి సూచించారు. గ‌త ప‌రిపాల‌న‌లో కాంట్రాక్టర్లు ప్రాజెక్టులు చేస్తే ఇపుడు అధికారులు డిజైన్ చేస్తున్నారని తెలిపారు. నాగార్జునసాగర్,శ్రీశైలం ప్రాజెక్టులు రేవంత్ బాబు కట్టాడా, చంద్రబాబు బాబు కట్టాడా అని ప్ర‌శ్నించారు. నాలుగు అక్షరాలు చదువుకున్నామని ఏదిపడితే అది మాట్లాడితే చెల్లుతుందని అనుకుంటే ప్రజలు అమాయకులు కారని జూప‌ల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఒకరు గులాంగిరి చేస్తే మరొకరు లగడపాటికి చంచాగిరి చేస్తున్నారని రేవంత్‌ - వంశీల‌పై మండిప‌డ్డారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తొక్కుడు తొక్కితే అధఃపాతాళానికి వెళ్లిన పార్టీ టీడీపీ అని ఉన్న కొంత మంది కూడా వచ్చే ఎన్నికల్లో గెలవరని జూప‌ల్లి వ్యాఖ్యానించారు. రేవంత్ లాంటి నేతల నోర్లను ఫినాయిల్ తో కడిగినా ఆ తిట్లతో చెడిపోయిన నోరు శుభ్రం కాదని విమ‌ర్శించారు. బ్రోకర్లు ,సీమాంధ్రకు చంచాగిరి చేసే మీ లాంటి నేతల వాళ్ళ ప్రతి పక్షాలకు ఇపుడు ఉన్న సీట్లు కూడా రావని జూప‌ల్లి జోస్యం చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/