Begin typing your search above and press return to search.
రామేశ్వరరావుకు కేసీఆర్ బంపర్ ఆఫర్?
By: Tupaki Desk | 30 Jun 2019 8:49 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావుకు టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగా అవకాశం దక్కబోతోందని సమాచారం. మై హోమ్ గ్రూపు సంస్థల యజమానిగా.. ప్రముఖ మీడియా సంస్థల అధిపతిగా.. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉన్న ఈయన కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు. తెలంగాణలోని కీలక ప్రాజెక్టులు ఈయన సంస్థనే చేపట్టింది. ఈయనకు భక్తి పారవశ్యం ఎక్కువ. అందుకే ఏపీ సీఎం జగన్ తో మాట్లాడి ఈయనకు టీటీడీ బోర్డులో సభ్యుడిగా తీసుకునేందుకు టీఆర్ఎస్ ముఖ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని జగన్ నియమించారు. మరో పదిరోజుల్లోనే సభ్యులను ఏపీ ప్రభుత్వ నియమించనుంది. సాధారణంగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు గడిచిన పాలకమండలిలో ఒక పోస్టు ఉండేది. ఇక తమిళనాడు, కర్ణాటకలకు అవకాశం ఇస్తారు. గడిచిన హయాంలో టీడీపీ ప్రభుత్వంలో సండ్ర వెంకటవీరయ్యకు టీటీడీలో సభ్యత్వాన్ని చంద్రబాబు ఇచ్చారు.
ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ వైఎస్ జగన్ ప్రభుత్వం.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. అందుకే ఒక పాలకమండలి సభ్యుడిని ఎంపిక చేసుకోవాలని కేసీఆర్ కు జగన్ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది.
అందుకే ప్రముఖ పారిశ్రామికవేత్త కావడం.. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ దైవభక్తి నిండుగా ఉన్న తన సన్నిహితుడైన జూపల్లి రామేశ్వరరావకి టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వడానికి కేసీఆర్ సిఫారసు చేసినట్టు వార్తలొస్తున్నాయి. జగన్ ఈ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించడమే తరువాయి. త్వరలోనే జూపల్లి టీటీడీ బోర్డు మెంబర్ గా ఆయన నియమితులు కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.