Begin typing your search above and press return to search.
ఆకాశంలో అద్భుతం.. 397 ఏళ్ల తర్వాత డిసెంబర్ 21న.. మిస్ కావొద్దు
By: Tupaki Desk | 7 Dec 2020 9:19 AM GMTఅనంత విశ్వంలో అద్భుతాలకు అంతే లేదు. ఏ మూలన ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అన్నింటిని పసిగట్టే సామర్థ్యం కూడా మనిషికి లేదు. తనకున్న పరిమిత వనరులతో గుర్తింస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒక అద్భుతం ఆకాశంలో చోటు చేసుకోనుంది. ఈ నెల 21న అందుకు వేదిక కానుంది. దాదాపు 397 సంవత్సరాల తర్వాత.. మరోసారి ఆ అరుదైన సీన్ చూసే అవకాశం దక్కనుంది. ఇంతకీ ఆ ఆకాశ అద్భుతం ఏమంటే..
గురు - శని గ్రహాలు అత్యంత సమీపానికి రానున్నాయి. ఆ సందర్భంగా అత్యంత ప్రకాశంతంగా కనిపించనున్నాయి. అప్పుడెప్పుడో నాలుగు శతాబ్దాల క్రితం.. అంటే 1623లో ఒకసారి ఇలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. భూమి నుంచి చూసినా.. ఈ తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించటం ప్రత్యేకత. భూమి నుంచి ఏవైనా రెండు గ్రహాలు అతి దగ్గరగా చేరినట్లు కనిపించే దృశ్యాన్నికంజక్షన్ అని పిలుస్తారు. చాలా గ్రహాలు ఇలా దగ్గరకు వస్తాయి. అయితే.. శని.. గురు గ్రహాలు దగ్గరగా రావటం అరుదుగా చోటు చేసుకుంటుంది.
డిసెంబరు 21న భూమి మీద నుంచి సాయంత్ర వేళలో.. ఈ రెండు గ్రహాలు దగ్గరగా రావటాన్ని స్పష్టంగా చూసే వీలు ఉంది. మన కళ్లకుఅత్యంత సమీపానికి వచ్చినట్లు కనిపించినా.. కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ రెండు గ్రహాల మధ్య దూరం అప్పటికి 73.5 కోట్ల కిలోమీటర్లుగా చెబుతున్నారు. ప్రతి నెలలోనూ చంద్రుడు.. అంగారకుడు, చంద్రుడు - గురు, చంద్రుడు - శని.. ఇలా దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. అందుకు భిన్నంగా గురు.. శని గ్రహాలు దగ్గరగా రావటం నాలుగు వందల ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత్ లోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఈ ఆకాశ అద్భుతాన్ని చూసే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిక.. డిసెంబరు 21 కోసం వెయిట్ చేద్దామా?