Begin typing your search above and press return to search.
ఏపీపై సవతి ప్రేమ కూడా చూపట్లే
By: Tupaki Desk | 5 May 2016 1:11 PM GMTఏపీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ కేంద్రం తేల్చిచెప్పడంపై ఆంధ్రప్రదేశ్ లో నిరసనలు మొదలవుతున్నాయి. నేతలంతా ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలు - ఆక్రోశాలను వెల్లగక్కుతున్నారు. తాజాగా టీడీపీ నేత జూపూడి ప్రభాకర రావు మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ పై కేంద్ర వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పై కనీసం సవతి తల్లి ప్రేమ కూడా చూపించడం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంతో రాజీపడ్డారని తమ పార్టీపై విమర్శలు వస్తున్నా ఓపికతో సహించామని ...ఇక కేంద్రం నుంచి స్పందన రాకపోతే ప్రజల తరుపున పోరాడేందుకు సిద్ధమని జూపూడి ప్రభాకరరావు తెలిపారు.
టీడీపీ ఎంపీ తోట నర్సింహం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి ప్రధాని నరేంద్ర మోడి - హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలుస్తామని చెప్పారు. విభజన నాటి నుంచి ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలను లోక్ సభలో వెల్లడించిన అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా, విభజన సమయంలోనూ ఎంతో ఆశపడేలా చేసిన ప్రధానమంత్రి - కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.