Begin typing your search above and press return to search.
`అమ్మ` మృతిపై విచారణ మొదలైంది!
By: Tupaki Desk | 30 Oct 2017 9:59 AM GMTఆమె మరణం.. తమిళ రాజకీయాల్లో మిస్టరీగా మారిపోయింది! ప్రజలు - అభిమానులకు ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది! ఎంతో మంది జీవితాలను మార్చివేసింది! ఇప్పుడు సన్నిహితుల తలరాతలను మార్చబోతోంది! తమిళ ప్రజలు `అమ్మ`గా కొలిచినా.. ఇతర పార్టీ నాయకులు పురట్టితలైవిగా పిలిచినా.. జయలలితకే చెల్లింది! మాజీ సీఎం - దివంగత జయలలిత మృతిపై రాజకీయ నాయకులు - `అమ్మ` అభిమానులు - సినీ నటులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! వారి డిమాండ్ మేరకు సీఎం పళనిస్వామి విచారణ కమిషన్ కు ఆదేశించారు. ఇప్పుడు ఈ విచారణలో తొలి అడుగు పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంలో పడింది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక ఉన్న మిస్టరీ నిగ్గుతేల్చేందుకు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగస్వామి శ్రీకారం చుట్టారు. సోమవారం పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న 15 మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు. పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంట్లో పని చేస్తున్న వారు - భద్రతా సిబ్బందిని విచారించాలని ఆర్ముగస్వామి నిర్ణయించారు. పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న వారికి ఇప్పటికే సమన్లు జారీ చేశారు. వీరంతా ఆయన ముందు సోమవారం హాజరుకానున్నారు.
అన్నాడీఎంకే పార్టీ వర్గాలు - తమిళనాడు ప్రజలు అమ్మ మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు చెయ్యడంతో సీఎం పళనిసామి విచారణ కమిషన్ కు ఆదేశించారు. విచారణ కమిషన్ కు ప్రత్యేక కార్యాలయం - సంబంధిత ఏర్పాట్లు చెయ్యడంలో జాప్యం జరిగింది. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సోమవారం రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి రంగంలోకి దిగారు. పోయెస్ గార్డెన్ లో జయలలిత ఇంటిలో పని చేస్తున్న వారిని మొదట విచారణ చేసి వివరాలు సేకరించాలని నిర్ణయించారు. మరి ఈ విచారణలో ఏం తేలుతుందో వేచిచూడాల్సిందే!!