Begin typing your search above and press return to search.
నా తండ్రిని కూడా రోడ్డుపై నిలబెట్టారు.. హైకోర్టు జడ్జి ఆవేదన
By: Tupaki Desk | 3 Nov 2021 11:30 PM GMTవిద్యా వ్యవస్థకు సంబంధించి కేసు విచారణలో జస్టిస్ బట్టు దేవానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రోడ్లపై ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో లెక్కించేందుకు ఉపాధ్యాయులను రహదారులపై నిలబెట్టారని తెలిపారు. వారిలో తన తండ్రి కూడా ఉన్నారని జస్టిస్ దేవానంద్ గుర్తు చేశారు. ఉపాధ్యాయులతో చదువు తప్ప, మిగిలిన అన్ని పనులు చేయిస్తున్నారని తప్పుబట్టారు. ఇది సరైంది కాదని తోచిపుచ్చారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అడ్వొకేట్ జనరల్ కు న్యాయమూర్తి సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఇతర నిర్మాణాలు లేకుండా చూడాలని గత ఏడాది జూన్‌లో ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీన్ని కోర్టు ధిక్కరణ కేసుగా నమోదు చేసి విచారిస్తోంది. విద్యా వ్యవస్థను నాశనం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి బట్టు దేవానంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో చదువు చెప్పించడం తప్ప, అన్ని పనులూ చేయిస్తున్నారని ఆక్షేపించారు. చివరకు మరుగుదొడ్లను కూడా కడిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పాఠశాలల మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు. భోజన పథకం పర్యవేక్షణ, బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పజెప్పడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.
గ్రామ సచివాలయాలను ఖాళీ చేయించకుండా బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని హైకోర్టు మండిపడింది. పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితి ఉండటం తీవ్రమైన విషయంగా ధర్మాసనం పరిగణించింది. గతంలో రోడ్లపై ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో లెక్కించేందుకు ఉపాధ్యాయులను రహదారులపై నిలబెట్టారని గుర్తుచేశారు. వారిలో తన తండ్రి కూడా ఉన్నారని జస్టిస్ దేవానంద్ తెలిపారు. ఎంతో వేదన కలిగిస్తే తప్ప, అవి గుర్తుండే అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు.