Begin typing your search above and press return to search.
జడ్జిల ఫోన్ కాల్ లీక్.. జాతీయ స్థాయిలో ప్రకంపనలు
By: Tupaki Desk | 7 Aug 2020 5:30 AM GMTఒకరేమో హైకోర్టులో జడ్జిగా పని చేసిన ప్రముఖుడు. మరొకరు కొన్నేళ్ల క్రితం సస్పెండ్ అయిన జడ్జి. వీరిద్దరి మధ్య సాగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన క్లిప్ అంటూ ఒకటి బయటకు రావటం.. దాన్ని తెలుగు మీడియాకు చెందిన ప్రముఖ సంస్థ ఒకటి ప్రచురించటం ఇప్పుడు సంచలనంగా మారింది. వాళ్లిద్దరి టేపులుగా చెబుతున్న ఈ టేపులో తోటి న్యాయమూర్తుల్ని.. మాజీలను ఉద్దేశించి ఇష్టారాజ్యంగా మాట్లాడిన మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారం జాతీయస్థాయిలో ప్రకంపనలు పుట్టించేలా మారింది.
ఈ మొత్తం కాల్ సంభాషణను క్లుప్తంగా చెప్పాలంటే.. ప్రస్తుతం సర్వీసులో ఉన్న జడ్జిలను తిట్టటమే కాదు.. ఏపీ సీజేగా ఉన్న న్యాయమూర్తిని ఇరుకున పెట్టిన ప్లాన్ ను చెప్పటమే కాదు.. రిటైర్డు జడ్జి జస్టిస్ నాగార్జున రెడ్డిపై నోరు పారేసుకున్న వైనం.. సుప్రీం జడ్జిల మీద ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైన మెటీరియల్ ను తీసుకురావాలన్న మాటలు చూస్తే.. గౌరవనీయ స్థానాల్లో ఉన్న వ్యక్తుల లోగుట్టు మాటలు ఇలా ఉంటాయా? అన్న షాక్ కు గురి కాక మానదు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన జస్టిస్ ఈశ్వరయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. అనంతరం అఖిల భారత బీసీ ఫెడరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆయనకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ మండలి ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కూడా న్యాయమూర్తే. ఆయన పేరు రామకృష్ణ. జడ్జిగా ఉన్న ఆయన ఎనిమిదేళ్ల నుంచి సస్పెన్షన్ లో ఉన్నారు. తాజా ఫోన్ కాల్ తో ఆయన ఇప్పుడు ఒక్కసారిగా అందరి కంట్లో పడ్డారు. సంచలనంగా మారిన ఈ కథనానికి సంబంధించి.. సదరు మీడియాసంస్థ ప్రచురించిన దాన్ని యథాతధంగా తీసుకోవటం జరిగింది. ఇంతకూ ఫోన్ సంభాషణ ఏముందన్నది సదరు మీడియా సంస్థలో ప్రచురించారన్నది చూస్తే..
రామకృష్ణ: నమస్కారం సార్.
ఈశ్వరయ్య: నమస్కారం.
రామకృష్ణ: సర్ నేను జడ్జి రామకృష్ణను.
ఈశ్వరయ్య: ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.
రామకృష్ణ: నేను పోస్టింగ్‌లో లేను సర్. 8 సంవత్సరాల నుంచి సస్పెన్షన్‌లో ఉన్నాను.
ఈశ్వరయ్య: ఆ విచారణ పూర్తి చేయలేదా! అందరూ... ‘వాడి’ చేతిలో ఉన్నారా.. అందుకేనా!
రామకృష్ణ: ఏమో సార్. అదే అనుమానం ఉంది. ఎంక్వైరీ పూర్తి చేయలేదు సర్.
ఈశ్వరయ్య: నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు నాతో మాట్లాడలేదు. కానీ నీపై నాకు ఎంత సానుభూతి ఉందో నీకు తెలీదు. కానీ అప్పుడు మన లాబీ నడవలేదు. నీకు అన్యాయం జరిగింది. నాకు అన్నీ తెలుసు! ‘నో కాన్ఫిడెన్స్’ మోషన్ తీసుకొచ్చినప్పుడు నేను ఎంతో చేశాను. ఒక్కరోజు కూడా నువ్వు కలవకపోయినా... నేను నీకోసం ఉన్నాను.
ఈశ్వరయ్య: విచారణ అధికారిగా ఎవరిని వేశారు?
రామకృష్ణ: విచారణ అధికారులు ముగ్గురు నలుగురు మారారు. 2015-16 మధ్య విచారణలు పూర్తయ్యాయి. ఆరోపణలన్నీ రుజువైనట్లు నివేదించారు. కానీ, హైకోర్టు దానిపై తదుపరి చర్యలు తీసుకోలేదు.
ఈశ్వరయ్య: విచారణాధికారి ఎవరు?
రామకృష్ణ: జగన్నాథం సర్, రిటైర్డ్!
ఈశ్వరయ్య: వాడు జగన్నాథమా! ఏసీబీలో ఉంటాడు! వాడు కమ్మోడు, వాడి తొత్తు! నాకు తెలుసు. నాగార్జున రెడ్డితో నువ్వు ఫైట్ చేస్తున్నావు కాబట్టి జగన్నాథం నీకు దగ్గర కావాలి కదా!
రామకృష్ణ: లేదు సార్. మొత్తము నాకు వ్యతిరేకంగా చేసాడు.
ఈశ్వరయ్య: ఇద్దరితో కొట్లాడినప్పుడు మాలాంటి వాళ్ల దగ్గరకు ఎందుకు రాలేదు? ఏమిటిలా...
రామకృష్ణ: నాకు అన్యాయం జరిగిందని వెళ్తున్నా సర్!
ఈశ్వరయ్య: నీకు అన్యాయం జరిగితే జగన్నాథం నీకు సాయం చేయాలి కదా! ఎందుకంటే వాడు నాగార్జున రెడ్డికి, జగన్నాథానికి పడదు కదా!
రామకృష్ణ: నాకు ఐడియాలేదు సార్!
ఈశ్వరయ్య: అప్పుడైనా వాడి హెల్ప్ తీసుకోవాల్సింది. అందరితో కొట్లాడితే ఎలా రామకృష్ణా! గవర్నమెంట్‌తో, వేరే వాళ్లతో గొడవలు అయితే ఎలా!
రామకృష్ణ: ఒక స్టాండ్ తీసుకున్న సర్ పూర్తిగా... ఎక్కడా తలవంచకూడదని!
ఈశ్వరయ్య: సాక్షులు నీకు ఫేవర్‌గా చెప్పలేదా!
రామకృష్ణ: సాక్షులు అంతా కోర్టు స్టాఫ్ కదా! నేను ఇండిపెండెంట్‌గా ఎవరినీ ప్రొడ్యూస్ చేయలేకపోయాను. ఎవరూ రాలేదు!.
ఈశ్వరయ్య: వీడు రిటైర్ అయ్యేదాకా ఆగుదామా.. ఇంకా ఏడాదిన్నర ఉంది. ఇప్పుడే నీకేమైనా సహాయం చేయగలనా! (అంటూ ఢిల్లీ జడ్జి ప్రస్తావన తెచ్చి, ఆయనను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడారు.)
రామకృష్ణ: ఈ పరిణామాలు ఊహించలేక పోయాను సార్. ఇంక వ్యవస్థ ఏమైపోతుంది సర్!
ఈశ్వరయ్య: ఢిల్లీలో ఉన్నప్పుడు అందరూ నాకు తెలుసు. అప్పుడు నా దగ్గరికి వస్తే సహాయం చేసేవాడిని! విజయసాయి రెడ్డి, ఇంకా చాలామంది సహాయం చేసి ఉండొచ్చు!
రామకృష్ణ: మిమ్మల్ని కలవకపోవడం దురదృష్టకరం.
ఈశ్వరయ్య: నాగార్జునరెడ్డి పెద్ద శాడిస్ట్, ఇతని గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఎంత మంది జీవితాలతో ఆడుకున్నాడో లెక్కేలేదు. వాళ్లవాడు హ్యూమన్‌రైట్స్ కమిషన్ ఇవ్వాలనుకున్నారు. నేను ఇవ్వొద్దని చెప్పాను. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చారు. రామకృష్ణా... ఇప్పుడు హైకోర్టు సీజే కొవిడ్ మార్గదర్శకాలు ఫాలో కావడం లేదని రాష్ట్రపతికి, సీజే ఇండియాకు లేఖ రాశాను. చూశావా! బాగుంది కదా అది!
రామకృష్ణ: బీసీ నాయకుడు హన్స్‌రాజు పేరుతో రాశారు కదా. మీకు సంబంధంలేదు కదా సర్ అది!
ఈశ్వరయ్య: నేనే! నా సంస్థే అది. నేను ఫౌండర్ ప్రెసిడెంట్, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్.
రామకృష్ణ: ఈ విషయం తెలియదు సర్! సారీ సర్.
ఈశ్వరయ్య: హన్స్‌రాజు మనకి హనుమంతుడు లెక్క.
రామకృష్ణ: ఆ భాష చూసి ఆయన అడ్వకేట్ అని అనుకున్నా సర్!
రామకృష్ణ: లేదులేదు. హైకోర్టులో కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించలేదని రిట్ పిటిషన్ కూడా వేశారు. రెండ్రోజుల్లో విచారణకు వస్తుంది! మొత్తం మోగిపోతుంది. వాళ్లని కంట్రోల్ చేసే శక్తి మన దగ్గర ఉందమ్మా! ఎవరంతకు వారు విడిపోతే ఎలా!
రామకృష్ణ: సర్ ఇప్పుడు ఏం సాయం చేస్తారో చెప్పండి! నన్నేమి చేయమంటారో చెప్పండి!
ఈశ్వరయ్య: హైకోర్టులో ప్రాక్ట్టీస్ చేశావా!
రామకృష్ణ: 2003లో సెలెక్ట్ అయ్యాను. మదనపల్లిలో మున్సబ్ కోర్టులో ప్రాక్టీస్ చేశాను సర్... చిన్న కోర్టు!
ఈశ్వరయ్య: సెలెక్టర్లు ఎవరు అప్పుడు?
రామకృష్ణ: జస్టిస్ సుదర్శన రెడ్డి గారు, జస్టిస్ చలమేశ్వర్ గారు, జస్టిస్ బిక్షపతి గారు ఉన్నారు.
ఈశ్వరయ్య: 2007, 08, 09 నేను 3 బ్యాచ్‌లు సెలెక్ట్ చేసాను. ఎస్సీలని నేను ఓపెన్‌గా సెలెక్ట్ చేశా. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మన వాళ్లను 75 పర్సెంట్ సెలెక్ట్ చేశా. దాదాపు 200 మందిని మేజిస్ట్రేట్‌లను చేశాను. ఇప్పుడున్న జడ్జిలందరూ అప్పుడు నేను సెలెక్ట్ చేసిన వాళ్లే!
రామకృష్ణ: అందరికీ సాయం చేశారు.నాకూ చేయండి.
ఈశ్వరయ్య: ఆలమాన్‌రాజు నా శిష్యుడే.నీ కేస్ కండెమ్న్ చేశాడని తెలిసి ఫోన్ చేసి తిట్టాను. జీవితంలో వాడిని ఎవరూ అంతగా తిట్టి ఉండరు. ‘‘నువ్వు పెద్దిరెడ్డి బంట్రోతువా,నౌకరువా, పాలేరువా! ఆయన చెప్పింది ఎందుకు చేశావు?రామకృష్ణ చెప్పినవన్నీ నిజాలే. నీకు ఎంత ధైర్యం?నువ్వు ఎలా ఇస్తావు?’’ అని తిడితే ‘సారీ సర్! ఇకపై ఇలాంటి పొరపాటు చేయను’ అని చెప్పాడు. ఏదో లబ్ధి పొందడానికి, వాడికి తెలియకుండా ఖండించాడు.
రామకృష్ణ: నన్నేమి చేయమంటారు సర్!
ఈశ్వరయ్య: నువ్వు నా దగ్గరికి రా నాన్నా! ఎప్పుడన్నా విజయవాడకు రా! నా గురించి ఏమీ ఉపయోగించుకోను. సమాజం కోసమే చేస్తాను. అంబేడ్కర్ ఇచ్చిన హక్కులు రక్షించుకోవడానికి, భావి తరాలకు అన్యాయం జరగకుండా పెట్టిన అసోసియేషన్.. ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్! దీని గురించి గూగుల్‌లో చూడు. అందులో అన్నీ ఉంటాయి. ఆర్గనైజేషన్‌కు నువ్వు ఎంత వెనుక ఉంటావో... మేమంతా నీ వెనుక ఉంటాము. సాయి ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు... మాట్లాడి నీకు హెల్ప్ అయ్యేలా చేస్తా. ధైర్యంగా ఉండు! నా జాతికి చెందిన వారికి అన్యాయం జరిగితే నా మనసుకు తెలుస్తుంది.
రామకృష్ణ: సంతోషం సర్!
ఈశ్వరయ్య: హైకోర్టులో మెటీరియల్ ఉంటే తీసుకురా... వాడికి వ్యతిరేకంగా నేను కూడా కొంత సేకరించాను.
రామకృష్ణ: నాగార్జున రెడ్డి ఆస్తుల చిట్టా ఉంది సర్!
ఈశ్వరయ్య: నాగార్జున రెడ్డి.. వాడొక చచ్చిన పాము. చెత్త.... (ఒక బూతు పదంవాడి ... ఢిల్లీ జడ్జి గురించిన మెటీరియల్ తీసుకురా... అని చెప్పారు. నాగార్జునరెడ్డి, ఆ జడ్జి ఇద్దరూ శత్రువులే అని చెప్పారు.) ఒక్కొక్కరినీ కొట్టుకుంటూ పోవాలి. ఇప్పుడు నాగార్జునరెడ్డిని తటస్థంగా ఉంచుకొని మనం ప్రభుత్వంతో సహాయం పొందాలి!
రామకృష్ణ: ఢిల్లీ జడ్జికి సంబంధించిన మెటీరియల్ లేదు. నాగార్జున రెడ్డి ఆస్తుల చిట్టా ఉంది నా దగ్గర!
ఈశ్వరయ్య: వాడు చెత్త... (మరికొంత పెద్ద బూతు) వాడి ఆస్తులు తెలుసు.. కడపలో కొన్నాడు! (ఇద్దరు మాజీ జడ్జిలకు మస్కా కొట్టి కొన్నాడు అని చెప్పారు.) వాడొక నీచుడు. వాడిని తటస్థంగా ఉంచుకుందాం. ప్రస్తుతానికి నాగార్జునరెడ్డిని పక్కన పెట్టు. ఈ ప్రభుత్వంతో ఎన్ని రకాల సాయమైన చేయిస్తా!
రామకృష్ణ: గవర్నమెంట్ అంటే జగన్మోహన రెడ్డి కదా! ఆయన మనకు సహాయం చేస్తారా! నాగార్జున రెడ్డికి బంధువే కదా!
ఈశ్వరయ్య: నాగార్జున రెడ్డికి జగన్మోహన రెడ్డి బంధువైనా సరే... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జగన్ అండగా ఉండాలి. నాగార్జున రెడ్డి ఒక చీడ పురుగు. వాడి మాటలు సీఎం వినడు. బతిమలాడి కాళ్లు, వేళ్లు మొక్కి ఆ పదవి తెచ్చుకున్నాడు. నువ్వు వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడం పక్కన పెట్టు. ఒక్కొక్కడిని కొట్టుకుంటూ వస్తాం. ఢిల్లీ జడ్జిని కొట్టుకుంటూ వద్దాం. అప్పుడు వీళ్లంతా మనకి దగ్గర అవుతారు.
రామకృష్ణ: అయితే ముందు సుప్రీంకోర్టు జడ్జి మీదే పడదామా సర్! అంత ధైర్యం ఉందా మనకు!
ఈశ్వరయ్య: ఎందుకులేదు... మెటీరియల్ ఉంటే నేను చేస్తున్నా కదా! చాలామంది సిద్ధంగా ఉన్నారు.
రామకృష్ణ: ఓకే ఓకే సర్.. నా సహకారం కూడా అందిస్తా!
ఈశ్వరయ్య: ఓకే నువ్వు సోమవారం రా! ఢిల్లీ జడ్జి గురించి ఏమైనా ఉంటే తీసుకురా!
రామకృష్ణ: థ్యాంక్యూ సర్.