Begin typing your search above and press return to search.

మీడియా పని మీడియాది.. నా పని నాది: హైకోర్టు జస్టిస్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   22 Sep 2020 5:30 PM GMT
మీడియా పని మీడియాది.. నా పని నాది: హైకోర్టు జస్టిస్ సంచలన వ్యాఖ్యలు
X
ముంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతం పటేల్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏజెంట్ గా ఉన్న వ్యక్తి ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కేసులో సమాచారాన్ని సీల్డ్ కవర్ లో పోలీసులు అందజేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధాన నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత ఉండాలన్నారు. సీల్డ్ కవర్ లోని సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో ఉంచాలన్నారు. పిటీషనర్లకు అందజేయాలని సదురు బ్రోకరేజ్ కు ఆదేశించారు.

అయితే ఇది చాలా సున్నితమైన విషయమని.. మీడియాకు పొక్కకూడదనే సీల్డ్ కవర్ లో ఇస్తున్నామని.. ఓ బ్రోకరేజ్ సంస్థ పేర్కొనడం పట్ల జస్టిస్ గౌతమ్ మండిపడ్డారు.

‘నేను స్వయంగా గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వను. మీడియా పని మీడియాది. నా పని నాది. నా ముందు దాఖలు చేసిన పత్రాలు చూసి ఓ నిర్ణయానికి వస్తాను తప్ప.. నా ఇంటికొచ్చే న్యూస్ పేపర్లు చూసి కాదు. మీడియాకు గురుతర బాధ్యత ఉంది. దాని పని దానిది. మీడియాలో వార్తలు రాకూడదని ప్రతివాది అడిగినంత మాత్రాన నేను గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వను. నా కోర్టులో ఎప్పుడూ గ్యాగ్ ఆర్డర్లు ఉండవు. నా కోర్టులో సీల్డ్ కవర్ వ్యవహారాలనే ప్రశ్నకు తావులేదు’ అంటూ జస్టిస్ గౌతమ్ స్పష్టం చేశారు.