Begin typing your search above and press return to search.

క‌ర్ణ‌న్ మొద‌టిసారి సారీ చెబుతాన‌న్నారు

By:  Tupaki Desk   |   12 May 2017 2:49 PM GMT
క‌ర్ణ‌న్ మొద‌టిసారి సారీ చెబుతాన‌న్నారు
X
మొండిత‌నంతో పీక‌ల మీద‌కు తెచ్చుకున్న న్యాయ‌మూర్తిగా క‌నిపిస్తారు క‌ల‌క‌త్తా హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ క‌ర్ణ‌న్‌. త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌న్న‌ట్లుగా ఇప్ప‌టికే ప‌లు వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు వెల్ల‌డించి.. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ తో స‌హా ప‌లువురు సుప్రీం న్యాయ‌మూర్తుల‌కు జైలుశిక్ష విధించిన ఆయ‌న‌పై అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. ఆయ‌న్ను అరెస్ట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. కోర్టు ధిక్కార కేసులో జ‌స్టిస్ క‌ర్ణ‌న్ వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఏడుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన సుప్రీం ధ‌ర్మాస‌నం ఆయ‌న‌కు ఆర్నెల్లు జైలుశిక్ష విధించారు. నాటి నుంచి క‌నిపించ‌కుండా పోయిన క‌ర్ణ‌న్ తాజాగా.. ఊహించ‌ని రీతిలో ఆయ‌న త‌న క్ష‌మాప‌ణ‌ల్ని రిజిస్ట్రార్‌ కు పంపారు.

జ‌స్టిస్ క‌ర్ణ‌న్‌ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న వేళ‌.. ఆయ‌న అనూహ్య‌మైన వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు. అత్యున్న‌త న్యాయ‌స్థానానికి తాను భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అనుకుంటున్న‌ట్లుగా ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానానికి విన్న‌వించారు. జ‌స్టిస్ క‌ర్ణ‌న్ అభ్య‌ర్థ‌న ప‌త్రాన్ని న్యాయ‌స్థానానికి అప్ప‌గించ‌గా.. దాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిర‌స్క‌రించింది. ఇదే స‌మ‌యంలో త‌న అరెస్ట్ పై సుప్రీం జారీ చేసిన ఆర్డ‌రుపై స్టే విధించాల్సిందిగా కోరుతూ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. అయితే.. వ్య‌వ‌హారం మీద సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు అందుబాటులో ఉన్న‌ప్పుడు పిటీష‌న్‌ ను విచారిస్తార‌ని కోర్టు పేర్కొంది.

దేశంలో కొంద‌రు న్యాయ‌మూర్తులు.. న్యాయ‌వాదులు అవినీతికి పాల్ప‌డిన‌ట్లుగా వ్యాఖ్యానించి సంచ‌ల‌నం సృష్టించిన ఆయ‌న‌పై కోర్టు ధిక్కార కేసును నమోదు చేశారు. అనంత‌రం.. ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌స్టిస్ క‌ర్ణ‌న్‌ కు ఆర్నెల్లు జైలు విధిస్తూ సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తీర్పు వెలువ‌రించింది. అప్ప‌టి నుంచి క‌నిపించ‌ని ఆయ‌న‌.. తాజాగా సారీ చెబుతానంటూ త‌న న్యాయ‌వాది ద్వారా త‌న వాద‌న‌ను వినిపించ‌టంతో.. ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/