Begin typing your search above and press return to search.
ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావు కేసులో కీలక ట్విస్ట్
By: Tupaki Desk | 3 Nov 2020 2:10 PM GMTఏపీ సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఏపీ సర్కార్ వేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ ధర్మాసనం నుంచి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
తన బెంచ్ కు వచ్చిన ఈ కేసును జస్టిస్ నాగేశ్వరరావు ‘నాట్ బిఫోర్ మీ’ అన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ కేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా పరిణామంతో శీతాకాలం సెలవుల తర్వాత మరో ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రానుంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారు. గతంలో కొనుగోలు చేసిన పరికరాల విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
అయితే ఏపీ ప్రభుత్వ సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ ఐపీఎస్ వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ న్యాయస్థానం సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ తీర్పును ఇచ్చింది.
అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీన్ని స్వీకరించడానికి జస్టిస్ నాగేశ్వరరావు తిరస్కరించి తప్పుకున్నారు.