Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: ప్రధాని భార్యకు కరోనా
By: Tupaki Desk | 13 March 2020 3:53 AM GMTకాదేవరు కరోనాకు అనర్హం అన్నట్టు పరిస్థితి ఉంది. సామాన్యుడి నుంచి స్టార్ హీరో వరకూ ఈ వైరస్ సోకుతూనే ఉంది. ఇటీవలే హాలీవుడ్ ప్రముఖ హీరో టామ్ హాంక్స్(63), ఆయన భార్య రీటా విల్సన్ (63) జంటకు కరోనా వైరస్ సోకింది. తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్న వీరు వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని టామ్ హ్యాంక్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో సినీ ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. ప్రస్తుతం వీరు ఆస్ట్రేలియాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక తాజాగా ఏకంగా ప్రధాని భార్యకు కరోనా సోకడం కలకలం రేపింది. అయితే సోకింది భారత ప్రధాని భార్యకు కాదు.. అమెరికా పైన ఉండే కెనడా దేశ ప్రధాని భార్యకు. ప్రధాని భార్యకే కరోనా సోకిందన్న వార్త అందరినీ కలవరపాటుకు గురిచేసింది.
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. దీంతో ఆమెను ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. ట్రూడో కూడా ఐసోలేషన్ లో ఉంటున్నారు.
కాగా ప్రధాని భార్య సోఫి ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ప్రధాని కూడా ముప్పేమీ లేదని తెలిపారు. చైనాలో పుట్టిన కరోనా ఇప్పుడు ఖండాతరాలు దాటి దాదాపు 4వేలకు పైగా మంది మరణాలకు కారణమవుతోంది.