Begin typing your search above and press return to search.
‘‘పిల్ల పిశాచి’’ని బయటకు వదిలేశారు
By: Tupaki Desk | 21 Dec 2015 3:59 AM GMTపిల్ల పిశాచిగా వ్యవహరించే నిర్భయ ఉదంతంలోని దోషి బయటకు వచ్చేశాడు. అతడి విడుదలను నిరసిస్తూ.. అతను విడుదల కాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా అతడిని చట్టబద్ధంగా విడుదల చేయాల్సిందేనని తేల్చేయటం అతని విడుదల ఆదివారం జరిగింది. అయితే.. అతడ్ని ఎక్కడ.. ఎప్పుడు విడుదల చేశారన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. అతనికి భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయన్న కారణంతో.. అతడ్ని ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో విడిచిపట్టినట్లుగా చెబుతున్నారు. ఇంటికి వెళతావా? స్వచ్ఛంద సంస్థలో ఉంటావా? అంటే.. ఇంటికి వెళ్లే కన్నా ఎన్జీవోలో ఉంటానని చెప్పటంతో అతడ్ని అక్కడ వదిలిపెట్టినట్లుగా చెబుతున్నారు.నిర్భయ ఉదంతంలో బాల నేరస్తుడి విషయంలో ఎందుకంత ఆగ్రహం? అతగాడు చేసిందేమిటన్న విషయంలోకి వెళితే..
మూడేళ్ల క్రితం ఢిల్లీలో నిర్భయ ఉదంతం జరిగినప్పుడే దేశం మొత్తం రగిలిపోయింది. ఒక మహిళ పట్ల ఇంత పాశవికంగా వ్యవహరిస్తారా? అన్న అగ్రహం వ్యక్తమైంది. నిర్భయ దోషుల్ని ఉరిశిక్ష విధించాలన్న బలమైన వాదన కూడా వెలువడింది. అయితే.. ఈ కేసులో నిర్భయ పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించి.. ఒక రకంగా ఆమె మరణానికి అసలు కారకుడైన వ్యక్తిని చట్టప్రకారం అతనికున్న వయసు దృష్ట్యా బాల నేరస్తుడిగా గుర్తించారు. కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థిని నిర్భయను సామూహిక అత్యాచారం చేసిన సమయంలో. . ఈ బాల నేరస్తుడు హేయమైన చర్యలకు పాల్పడ్డాడు. ఇనుప రాడ్ ను ఆమె జననాంగంలోకి దూర్చి.. తిప్పటం లాంటి ఎన్నో దుశ్చర్యలకు పాల్పడ్డాడు.
అత్యంత కిరాతక మనస్తత్వం ఉన్న అతడికి.. సాంకేతికంగా మైనర్ కావటంతో.. మూడేళ్ల జైలు శిక్షను మాత్రమే విధించి.. బాలనేరస్తుల్ని ఉంచే చోట ఉంచారు. శిక్షా కాలం పూర్తి అయిన నేపథ్యంలో ఆదివారం అతడ్ని విడుదల చేయాల్సి ఉంది. అతడ్ని విడుదల కాకుండా అడ్డుకునేందుకు నిర్భయ తల్లిదండ్రులతో సహా.. పలు సంఘాలు చివరికంటా ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. అతడి విడుదలను వ్యతిరేకిస్తూ సుప్రీంలో దాఖలు చేసిన కేసు.. సోమవారం విచారణకు రానుంది. పిల్ల పిశాచిగా వ్యవహరించే బాల నేరస్తుడ్ని విడుదల చేయటంపై ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.