Begin typing your search above and press return to search.
నిర్భయ కేసులో అధికారులు సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 3 Dec 2015 9:40 AM GMTనిర్భయ ఘటన గుర్తు ఉంది కదా. ఆ దుర్మార్గ ఘటనలో అత్యంత దారుణంగా.. పైశాచికంగా వ్యవహరించింది మైనర్ అయిన ఒక బాలుడు(చట్ట ప్రకారంగా చెబితే..) ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సమయంలో వాంగూల్మాన్ని ఇచ్చిన నిర్భయ.. తనను దారుణంగా హింసించింది బాల నేరస్తుడిగా నిరూపితమైన వ్యక్తేనని చెప్పింది. నిజానికి ఆమె మరణానికి అతడే కారణంగా పలువురు చెబుతుంటారు. ఒక ఇనుప రాడ్ ను ఆమె జననాంగంలోకి దూర్చి.. అత్యంత పైశాచికంగా వ్యవహరించినప్పటికీ బాలనేరస్తుడు కావటంతో అతడికి మూడేళ్ల జైలుశిక్ష విధించారు.
కోర్టు విధించిన జైలుశిక్ష ఈ డిసెంబరు చివరి నాటికి పూర్తి అవుతుంది. మరి.. ఈ పిల్ల పిశాచిని విడుదల చేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఇతగాడి ముఖం అందరికి చూపించాలని.. అతడి బారిన పడకుండా జనాల్ని చైతన్యం చేయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు ఈ మధ్య కోరటం తెలిసిందే.
తాజాగా తీసుకున్ననిర్ణయం ప్రకారం.. ఈ పిల్ల పిశాచిని గడువు పూర్తి అయిన తర్వాత కూడా జైలు నుంచి విడుదల చేయకూడదని అధికారులు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. డిసెంబరు 22తో అతడికి విధించిన మూడేళ్ల జైలు శిక్ష పూర్తి అవుతుంది. నేరం చేసిన సమయంలో మైనర్ అయినప్పటికీ.. ఇప్పుడు మేజర్. ఈ పిల్ల పిశాచిని గడువు పూర్తి అయిన తర్వాత కూడా విడుదల చేయకుండా ఒక స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో ఉంచి.. ఇతడి ప్రవర్తనను ఒక ఏడాది పాటు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.