Begin typing your search above and press return to search.
గుత్తా జ్వాల 20 కోట్లతో మొదలుపెట్టేసింది
By: Tupaki Desk | 13 March 2017 7:50 AM GMTభారత బ్యాడ్మింటన్లో గుత్తా జ్వాలది ప్రత్యేకమైన స్థానం. ప్రకాశ్ పదుకొనే.. పుల్లెల గోపీచంద్.. సైనా నెహ్వాల్.. పి.వి.సింధులతో సమానంగా అంతర్జాతీయ స్థాయిలో ఆమె అనేక ఘనతలు సాధించింది. కాకపోతే ఆటతో పాటే ఎప్పుడూ ఏదో ఒక వివాదంతోనూ ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో ఆమెకు ఎప్పుడూ గొడవలే. ఎప్పుడూ సింగిల్స్ క్రీడాకారులకే అండగా నిలుస్తాడని.. డబుల్స్ ప్లేయర్లను పట్టించుకోడని.. కొంతమందికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని గోపీ మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది జ్వాల. భారత బ్యాడ్మింటన్లో గోపీ ఏక ఛత్రాధిపత్యాన్ని కూడా ఆమె కొన్నిసార్లు ప్రశ్నించింది.
ఇప్పుడు గోపీకి చెక్ పెట్టడానికేనో ఏమో.. గుత్తా జ్వాల స్వయంగా భారీ స్థాయిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. ఓ కార్పొరేట్ సంస్థతో కలిసి ఆమె రూ.20 కోట్ల పెట్టుబడితో బ్యాడ్మింటన్ అకాడమీలు మొదలుపెడుతుండటం విశేషం. ముందుగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జ్వాల అకాడమీ ఆరంభమవుతుంది. అంతర్జాతీయ స్థాయి కోచ్ లతో కలిసి బ్యాచ్ కు 20 మంది చొప్పుకు యువ ప్రతిభావంతులకు ఈ అకాడమీలో శిక్షణ ఇస్తారట. ముందు హైదరాబాద్ లో అకాడమీ మొదలుపెట్టి.. ఆ తర్వాత పుణె.. బెంగళూరు.. ఢిల్లీ ముంబయి సహా చాలా నగరాలకు అకాడమీని విస్తరించేందుకు జ్వాల ప్రణాళికలు రూపొందించుకుంది. మరి ఆమె ప్రయత్నం ఏ మేరకు విజయవంతం అవుతుందో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/