Begin typing your search above and press return to search.
తెలంగాణ ఓటింగ్ తీరిది..గుత్తా జ్వాల ఓట్ కట్
By: Tupaki Desk | 7 Dec 2018 5:25 AM GMTతెలంగాణలోని 119 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దేశంలోనే కొత్త రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణలోని మొత్తం 2.80 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కమిషన్ తెలంగాణ వ్యాప్తంగా 32815 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,80,74,722 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,14,56,182 మంది పురుషులు - 1,39,05811 మంది స్ర్తీలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరేకాక 10,038మంది సర్వీస్ ఉద్యోగులు - 248 మంది విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
దేశంలో ఈసారి ఎన్నికల్లో మొదటిసారి ఓటరు వెరిఫికేషన్ పేపర్ అడల్ట్ ట్రైల్ (వీవీపాట్)లను వినియోగిస్తున్నారు. తెలంగాణలోనూ దీన్ని ప్రవేశపెట్టారు. ఓటర్లు ఓటు వేయగానే వీవీ ప్యాట్ లో తమ ఓటు ఎవరికి వేసామో సింబల్ కనపడి ప్రింట్ కూడా వస్తుంది. 7 సెంకడ్ల తర్వాత ఆ ప్రింట్ వీవీ ప్యాట్ లో పడిపోతుంది.
తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ ఎస్ - మహాకూటమిలోని నాలుగు పార్టీల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసిపోతుంది. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసిపోతుంది.
కాగా తాజాగా స్టార్ షెట్లర్ గుత్తా జ్వాల తన ఓటు హక్కు మిస్ అయ్యిందని ట్విట్టర్ లో వాపోయింది. తన పేరు ఎన్నికల ఓటరు లిస్టులో లేదని పేర్కొంది. ఓటేసేందుకు ఉత్సాహంగా వెళ్లగా ఓటరు లిస్టులో లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగానని తెలిపారు. తన ఓటు హక్కు ను తీసేసిన అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.