Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మెచ్యూరిటీ లెవెల్స్ మ‌రీ త‌క్కువా?

By:  Tupaki Desk   |   12 April 2016 4:04 PM GMT
జ‌గ‌న్ మెచ్యూరిటీ లెవెల్స్ మ‌రీ త‌క్కువా?
X
ఒక్కో రాజ‌కీయ అధినేత‌కు కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని ట‌చ్ చేయాలే కానీ ప్ర‌జ‌లు వెంట‌నే క‌నెక్ట్ అయిపోతారు. విశ్వ‌స‌నీయ‌త అనే మాటను చంద్ర‌బాబు మీద ప్ర‌యోగిస్తే చాలు ఆయ‌న డిఫెన్స్ లో ప‌డ‌తారు. అదే ల‌క్ష‌కోట్ల ఆస్తి అన్న వెంట‌నే వైఎస్ జ‌గ‌న్ గుర్తుకు వ‌చ్చేస్తారు. ఇలా కొన్ని ప‌దాలు ఉప‌యోగించినంత‌నే స‌ద‌రు అధినేత‌లు ఇరుకున ప‌డిపోతారు. అందుకే.. ఇలాంటి మాట‌ల్నే త‌మ విమ‌ర్శ‌ల్లో ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతుంటారు స‌ద‌రు అధినేతల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు. ల‌క్ష కోట్ల రూపాయిల ఆస్తి అన్న వెంట‌నే జ‌గ‌న్ ఎలా గుర్తుకు వ‌స్తారో.. కాస్త తేడాగా వ్య‌వ‌హ‌రించ‌టం.. ఒంటెద్దు పోక‌డ‌లతో ఉండ‌టం లాంటి మాట‌లు విన్న వెంట‌నే జ‌గ‌న్ రూపం గుర్తుకు వ‌స్తుంది.

అందుకేనేమో.. ఇంత‌కాలం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితంగా వ్య‌వహ‌రించిన జ్యోతుల నెహ్రు.. తాజాగా సైకిల్ ఎక్క‌టం తెలిసిందే. పార్టీ మారిన వెంట‌నే.. పుట్టింటికి వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. త‌న ఎక్స్ అధినేత జ‌గ‌న్ గురించి సూటిగా త‌గిలే వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదినేత‌కు మెచ్యూరిటీ త‌క్కువ‌న్న భావ‌న వ‌చ్చేలా విమ‌ర్శ‌లు చేశారు.

అంతేకాదు.. జ‌గ‌న్ ఒంటెద్దు పోక‌డ‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తార‌ని.. అసెంబ్లీలో ఉప నాయ‌కుడిగా ఉన్న త‌న మాట‌కు కూడా విలువ ఇవ్వ‌లేద‌ని.. త‌న‌ను దూరం పెట్టారంటూ వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. తాను త‌ప్ప మిగిలిన వారంతా జీరో అనే నాయ‌కుడి ద‌గ్గ‌ర ఎంత‌కాలం ప‌ని చేసినా పార్టీ అభివృద్ధి కాద‌న్న మాటా జ్యోతుల నోటి నుంచి రావ‌టం చూస్తే.. ఏ మాటలు జ‌గ‌న్ ను బాగా డ్యామేజ్ చేస్తాయో అవే మాట‌ల్ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.