Begin typing your search above and press return to search.
వైసీపీ సీనియర్ పార్టీ మారట్లేదా?!
By: Tupaki Desk | 23 Feb 2016 10:55 AM GMTవైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసల పర్వం కొనసాగుతుందా? సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జంపింగ్ తో ప్రారంభమైన ఈ ట్రెండ్ లో తర్వాతి పేరు పార్టీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూదా? ఇప్పటికే ఆయన ప్రాథమిక చర్చలు జరిపారా? అనే చర్చోపచర్చలు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో జోరుగు జరుగుతున్న సమయంలోనే జ్యోతుల నెహ్రూ క్లారిటీ ఇచ్చేశారు.
భూమా పార్టీ మారిన నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన జ్యోతుల నెహ్రుపై జంపింగ్ టాక్ తెరమీదకు వచ్చింది. వైసీపీకి పట్టున్న జిల్లాకు చెందిన నాయకుడు కాబట్టి పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. అయితే నెహ్రూ వైసీపీలో కొనసాగాలా..టీడీపీలో చేరిపోవాలా... ఇప్పటికప్పుడే ఏ నిర్ణయం తీసుకోవాలి అనే సందేహంలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. నెహ్రూ ప్లేట్ ఫిరాయించడం ఖాయమని పలువురు తేల్చేశారు. జగన్ కుటుంబానికి దగ్గరైన వ్యక్తిగానే కాకుండా సీమలో ముఖ్య నేత అయిన భూమానే జంప్ చేశాడంటే... నెహ్రూ తన రాజకీయ భవిష్యత్ కు భరోసా కోసం పార్టీ మారడనే గ్యారంటీ ఏంటని విశ్లేషించారు.
అయితే నెహ్రూ దీన్నంతా కొట్టిపారేశారు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని పేర్కొంటూ...వైసీపలో రాజకీయ భవిష్యత్‌కు ఢోకా లేదని చెప్పారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క సీటే దక్కినట్లు...రాబోయే ఎన్నికల్లో టీడీపీ నామమాత్రపు విజయం సాధిస్తుందని చెప్పారు. నెహ్రూ తాజా స్టేట్ మెంట్ చూస్తుంటే...ఇప్పట్లో పార్టీ మారేలాగా కనిపించడం లేదు. అయితే ప్రస్తుత రాజకీయాల ట్రెండ్ లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కదా.