Begin typing your search above and press return to search.
అరుణాచల్ గవర్నరు అందరికీ గుణపాఠమే!!
By: Tupaki Desk | 13 Sep 2016 5:30 PM GMTప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్ట సభల్లోనేనని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు కొందరు గవర్నర్లు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి అత్యుత్సాహం దెబ్బతీస్తుందని అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్ ఖోవా బర్తరఫ్ నిరూపించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించే గవర్నర్లు గతంలోనూ ఇదే మాదిరిగా అవమానాల పాలయిన ఘటనలున్నాయి. రాజ్ ఖోవా ప్రధాని మోడీకి అత్యంత ప్రీతిపాత్రుడన్న అభిప్రాయం చాలామందిలో ఉంది... మోడీ నియమించిన తొలి గవర్నరు ఆయనే... కానీ... ఇప్పుడు మాత్రం అవమానకరంగా పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.
రాజ్ ఖోవా 1968వ సంవత్సరం బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసే రోజుల్లోనే నరేంద్రమోడీని పొగడటం మొదలు పెట్టారు. సాధారణంగా అంత పెద్ద హోదాలో ఉన్న అధికారులెవరూ రాజకీయ నాయకులపై ఎంత అభిమానం ఉన్నా అంత బరితెగించి తమ మనసులోని మాటను బయటపెట్టరు. ఐఏఎస్ కేడర్ అధికారులు మరింత జాగ్రత్తగా ఉంటారు. ఆ హోదాలో దశాబ్దాల పాటు పని చేసిన అధికారులు ఇంకా ఎక్కువ సీరియస్ గా ఉంటారు. మోడీపై రాజ్ ఖోవా ప్రశంసలు కురిపించడాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు ఆక్షేపించాయి. నిరసన తెలిపాయి. మోడీపై ఆయన ప్రశంసలు వృధాకాలేదు. మోడీ ప్రభుత్వం నియమించిన తొలి గవర్నర్ ఆయనే. అందుకు తగినట్టుగానే అరుణాచల్ గవర్నర్ గా రాజ్ ఖోవా మోడీకి అత్యంత విధేయునిగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడినట్టు వార్తలు రాగానే రంగంలోకి దిగి పోయి కేంద్రం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా పావులు కదిపారు. తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను కలుసుకోవడానికి సులభంగా అనుమతి ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు గవర్నర్లు తటస్థంగా ఉంటారు.ఉండాలి కూడా. కానీ రాజ్ ఖోవా మాత్రం జోరు చూపించారు.
అలాంటి సందర్బాల్లో రాజకీయ బేరసారాలన్నీ పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల ద్వారానే గతంలో జరిగేవి. కానీ రాజ్‌ఖోవా గవర్నర్‌గా కొనసాగుతూ కేంద్ర నాయకులకు రాష్ట్రంలో పరిస్థితి వివరించే పేరిట మధ్యవర్తిగా వ్యవహరించారని అరుణాచల్ కాంగ్రెస్ నాయకుడు - మాజీ ముఖ్యమంత్రి నబామ్ టుకీ ఆరోపించారు. తిరుగుబాటు కాంగ్రెస్ నాయకుడు కలిఖో పుల్‌ని ముఖ్యమంత్రిగా చేయడంలో కమలనాథుల కన్నా - రాజ్ ఖోవాయే ఎక్కువ ఆసక్తిని చూపారని కూడా ఆరోపించారు. మూడుదశాబ్దాల క్రితం అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును దించడంలో ఆనాటి గవర్నర్ రామ్ లాల్ కూడా ఇదే మాదిరిగా వ్యవహరించారు. ఆయన గవర్నర్ గా కాకుండా - కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఏజెంట్ గా వ్యవహరించారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. స్వతంత్ర భారత దేశంలో అప్రదిష్టపాలైన గవర్నర్ల జాబితాలో రాజ్ ఖోవా తాజాగా చేరారు. కలిఖోపుల్ ని గద్దె నెక్కించడంలో ఆయన అత్యుత్సాహాన్ని ప్రదర్శించారన్న విమర్శలు వైరి పక్షాల నుంచి రావడమేకాకుండా -సుప్రీంకోర్టు కూడా ఆయన పాత్రపై తీవ్రమైన ఆక్షేపణ తెలిపింది. రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు ఎమ్మెల్యేల బేరసారాలకు గవర్నర్లు దూరంగా ఉండాలనీ, రాజకీయ నాయకుని మాదిరిగా జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేస్తూ - ముఖ్యమంత్రి పదవిలో నబామ్ టుకీ కొనసాగాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. రాజ్ ఖోవా ఆరోజునే రాజీనామా చేసి ఉంటే ఆయన పరువు దక్కి ఉండేది. ఆయనను రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకున్న కేంద్ర నాయకుల పరువు కూడా కొంతలో కొంత మిగిలేది. మరోవైపు పదవి పోయిన తరువాత నెల రోజుల్లోనే పదవీచ్యుత సీఎం కలిఖో పుల్ ఆత్మహత్య చేసుకోవడం మరిన్ని ఆరోపణలకు కారణమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ మచ్చలన్నీ కడుక్కునేందుకు రాజ్ ఖోవాను రాజీనామా చేయమని కోరింది.
అంతకుముందు ఉత్తరాఖండ్ లో కూడా ఇదే మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు కమలనాథులు జరిపిన తంత్రాంగం బెడిసికొట్టింది. మోడీ ప్రభుత్వానికి రాజకీయంగా తగిలిన మొదటి ఎదురుదెబ్బ అదే. అది జరిగిన తర్వాతనైనా పద్దతి మార్చుకుని ఉండి ఉంటే అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో కేంద్రం అప్రదిష్టపాలై ఉండేది కాదు. రాష్ట్రాల్లో వైరి పక్షాల ప్రభుత్వాలను కూల్చడంలో గతంలో కాంగ్రెస్ అనుసరించిన పన్నాగాలూ, కుయుక్తులనే బీజేపీ కూడా అనుసరించిందన్న ముద్ర పడి ఉండేది కాదు. రాజ్ ఖోవాని నమ్ముకోవడం వల్లే నవ్వులపాలయ్యామని గ్రహించిన కమలనాథులు అరుణాచల్ పరిణామాల తర్వాత నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అనారోగ్యకారణాలుచెప్పి మర్యాదగా రాజీనామా చేసి వెళ్ళిపోవల్సిందిగా సంకేతాలు ఇచ్చారు. ఆయన అవేమీ పట్టించుకోలేదు.సరికదా, తాను స్వచ్ఛందంగా రాజీనామా చేయననీ - తనను తొలగించాల్సింది రాష్ట్రపతి అనీ, ప్రభుత్వం కానేకాదని అడ్డంతిరిగారు. దాంతో కేంద్ర నాయకులు మరింత ఇరుకున పడ్డారు.ఆయన మొండి వైఖరి ప్రధాని మోడీకి కూడా చీకాకు పెట్టింది. మరోవైపు తనను అనారోగ్యకారణాల మిషపై రాజీనామా చేయమంటున్నారని రాజ్‌ఖోవా రాష్ట్రపతికి సుదీర్ఘమైన లేఖ రాశారు.రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల సందర్భంగా తన పాత్రపై సవివరంగా ఆ లేఖలో వివరించారు.ఆ లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపడం,గవర్నర్‌పై హోం శాఖ సుదీర్ఘ నివేదిక సమర్పించడంతో చివరికి రాజ్ ఖోవాని రాష్ట్రపతి బర్తరఫ్ చేశారు. అలా మోడీ ఏరికోరి తెచ్చుకున్న గవర్నరు చివరకు మోడీకే మచ్చ తేవడంతో గెంటేయించుకున్న పరిస్థితి ఏర్పడింది.