Begin typing your search above and press return to search.

25 సంవత్సరాల క్రితం తొలిసారి ఫోన్ మాట్లాడింది ఎవరంటే

By:  Tupaki Desk   |   30 July 2020 6:00 PM GMT
25 సంవత్సరాల క్రితం తొలిసారి ఫోన్ మాట్లాడింది ఎవరంటే
X
భారతదేశంలో మొట్టమొదటి ఫోన్ సంభాషణ జరిగి జూలై 31 పాతిక సంవత్సరాలు. 25 ఏళ్ల క్రితం జూలై 31, 1995లో తొలిసారి నాటి కేంద్ర టెలికం మంత్రి సుఖ్‌రాం (ఢిల్లీ), నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు మొట్టమొదటిసారి మొబైల్ ఫోన్లో మాట్లాడుకున్నారు. మోడీ టెల్‌స్ట్రా మొబైల్ నెట్ సర్వీస్ ద్వారా తొలి ఫోన్ కాల్ చేశారు. ఈ ఇరవై అయిదేళ్లలో భారత్‌లో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 98.91 కోట్లకు చేరుకుంది.

నోకియా 2110 మొబైల్ ఫోన్స్ ద్వారా జ్యోతిబసు, సుఖ్‌రాం మాట్లాడుకున్నారు. నోకియా కనెక్టింగ్ ది పీపుల్ అని ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే 1995లో ఈ తేదీన భారత టెలికం చరిత్ర ఈ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. 1995లో మొబైల్ కాల్ కాస్ట్ నిమిషానికి దాదాపు 50 సెంట్లుగా ఉంది. అప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్‌కు కూడా చార్జీలు ఉండేవి. ఇప్పుడు మొబైల్ ఉండటం సాధారణంగా మారిపోయింది. కానీ 1995 నుండి దశాబ్దం, దశాబ్దంన్నర వరకు మొబైల్ ఫోన్ ఉంటే లగ్జరీయే.

ఇప్పుడు మొబైల్ కాల్స్ ఛార్జీలు భారీగా పడిపోయాయి. పైగా ఇన్‌కమింగ్ కాల్స్‌కు డబ్బులు లేవు. ప్రస్తుత కాలంలో సగటున దాదాపు ప్రతి భారతీయుడు ఒక మొబైల్ కలిగి ఉన్నాడు. భారత్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్ కలిగిన దేశం.