Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: మోడీ, షాలను కలిసి సింధియా
By: Tupaki Desk | 10 March 2020 6:32 AM GMTమధ్యప్రదేశ్ రాజకీయాల్లో అసమ్మతి కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా పెను సంచలనం సృష్టించారు. సీఎం కమల్ నాథ్ సర్కారును కూల్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలతో గ్రూపు కట్టిన సింధియా తన వర్గంలోని 17మందితో కర్ణాటకలోని బెంగళూరుకు జంప్ కట్టారు. అక్కడే అసమ్మతి రాజకీయం నడుపుతున్నారు.
తాజాగా ఢిల్లీ వెళ్లిన జ్యోతిరాధిత్య సింధియా ప్రధాని మోడీ, అమిత్ షాలను భేటి కావడం రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పక్కా కాంగ్రెస్ వాది, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన సింధియా సీఎం పీఠం దక్కకపోవడం.. కమల్ నాథ్ తో వైరం దృష్ట్యానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కమల్ నాథ్ తో సింధియాకు చెడడం తో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ రంగంలోకి దించింది. ఆయన భోపాల్ లో మంత్రాంగం నడిపారు. సింధియాతోనూ, అసమ్మతి ఎమ్మెల్యేలతోనూ సంప్రదింపులు జరిపారు. దీంతో సింధియా ఈ ఉదయం మోడీషాలను కలిసి చర్చలు జరిపారు.
త్వరలోనే తన వర్గం 17మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో సింధియా చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కూలి సింధియా మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది. మరి సింధియాను బీజేపీ ఎలా గౌరవిస్తుందనేది వేచిచూడాలి.