Begin typing your search above and press return to search.

రాహుల్ సన్నిహితుడు కూడా రాజీనామా!

By:  Tupaki Desk   |   8 July 2019 5:14 AM GMT
రాహుల్ సన్నిహితుడు కూడా రాజీనామా!
X
ఒకవైపు రాహుల్ గాంధీ రాజీనామా చేసేశారు. రాహుల్ కాంగ్రెస్ పార్టీని అస్సలు పట్టించుకోవడం లేదనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. కనీసం కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారంపై కూడా రాహుల్ గాంధీ దృష్టి సారించడం లేదని వార్తలు వస్తున్నాయి. తను అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన నేపథ్యంలో తన స్థానంలో మరొకరి ఎన్నికకు రాహుల్ తన వంతు సలహాలు ఇవ్వాల్సి ఉంది.

అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినా పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం రాహుల్ కు ఉంది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియలో రాహుల్ క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంది.

అయితే ఆయనేమో.. ఆ ప్రక్రియనే పట్టించుకోవడం లేదు. ఆ సంగతలా ఉంటే.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు అయిన జ్యోతిరాదిత్య సింధియా కూడా రాజీనామా చేసినట్టుగా ట్వీట్ చేసేశాడు.

ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉండేవాడు సింధియా. రాహుల్ కు అత్యంత సన్నిహిత నేతగా - యువనేతగా సింధియాకు గుర్తింపు ఉంది. ఇటీవలే ముఖ్యమంత్రి పదవి కూడా ఈయనకు మిస్ అయ్యింది. ఇలాంటి నేఫథ్యంలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి బాధ్యత వహిస్తూ సింధియా రాజీనామాను ప్రకటించాడు.

ఇన్ని రోజులూ తనకు సహకరించిన వాళ్లందరికి థ్యాంక్స్ అంటూ తేల్చేశాడు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఆశాకిరణాలు అనిపించిన వాళ్లే ఇలా రాజీనామాలు చేస్తుంటే.. ఆ పార్టీ పరిస్థితి ఏమిటో!