Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కి షాక్ ఇవ్వబోతున్న సింధియా !
By: Tupaki Desk | 25 Nov 2019 11:03 AM GMTప్రస్తుత దేశ రాజకీయాలలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేక పోతుంది. మోడీ నాయకత్వంలోని బీజేపీ వరుసగా ప్రభంజనం సృష్టించడం తో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి మరింత దారుణంగా తయారవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ లోని చాలామంది కీలకనేతలు కాంగ్రెస్ కి షాక్ ఇస్తూ ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ కి మరో షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ టీమ్ లో కీలక నేతగా పేరుపడ్డ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ కి త్వరలో గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం. సింధియా అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే సింధియా అన్నంతగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో జ్యోతిరాదిత్య సింధియా కుటుంబానికి గుర్తింపు ఉంది. తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జ్యోతిరాదిత్య సింధియా తన ట్విట్టర్ అకౌంట్ బయోడేటా నుంచి కాంగ్రెస్ పేరును తొలగించారు. కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా కేవలం ప్రజా సేవకుడు, క్రికెట్ ప్రేమికుడని మాత్రమే బయోడేటా లో పొందు పరిచారు.
ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల తో పాటు దేశ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. దీనిపై సింధియా స్పందిస్తూ ... నెల రోజుల క్రితమే దాన్ని తాను మార్చానని, ప్రజల సూచనతోనే తన బయోడేటాను సంక్షిప్తీకరించానని అన్నారు. దీనిలో ఎలాంటి రాజకీయాలు లేవని పుకార్లను నమ్మొద్దని కోరారు. కానీ , దీని వెనుక బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది. అదేమిటి అంటే .. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సారథిగా జ్యోతిరాదిత్య సింధియా పేరును కాకుండా.. దివంగత నేత అర్జున్ సింగ్ తనయుడు అజయ్ సింగ్ పేరును సీఎం కమల్ నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెర పైకి తీసుకు రావడంతో సింధియా ఆలోచనల్లో పడ్డారని చెబుతున్నారు. అలాగే ఈ మధ్య సింధియా బీజేపీ కి మద్దతుగా సింధియా ట్వీట్లు చేశారు. ఆర్టికల్ 370 తదితర అంశాలకు ఆయన మద్దతు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. దీనితో త్వరలో సింధియా కమలం గూటికి చేరబోతున్నాడా అని చర్చించుకుంటున్నారు.