Begin typing your search above and press return to search.
అమెరికా నుంచి పాల్ వీడియో కాల్..వైరల్!
By: Tupaki Desk | 24 Jan 2018 4:37 PM GMTకిలారి ఆనంద్ పాల్.....షార్ట్ కట్ లో కే ఏ పాల్.....భారత్ లో ఈ ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఫ్లోరిడాలో తాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశానని - ప్లోరిడాలో ఆయన విజయం సాధించారని పాల్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల నుంచి అమెరికాలో మకాం వేసిన కేఏ పాల్ ఈ రోజు అమెరికా నుంచి వీడియో కాల్ ద్వారా హైదరాబాద్ లోని మీడియా మిత్రులతో మాట్లాడారు. సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో మీడియా మిత్రులతో మాట్లాడిన పాల్ అనేక షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెరికా - ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు తాను ఇరు దేశాధినేతలతో పాటు - కీలక నేతలతో చర్చలు జరిపానని - ఆ యుద్ధం జరగకుండా ఆపడంలో తాను కీలకపాత్ర పోషించానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫిబ్రవరి 10 తారీకున తాను హైదరాబాద్ - సికింద్రబాద్ లలో పర్యటించబోతున్నానని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గ్లోబల్ పీస్ ర్యాలీ నిర్వహించబోతున్నానని చెప్పారు. ఈ ర్యాలీకి తన మిత్రులు - బంధువులు - మీడియా - అన్ని కుల మతాలకు చెందిన ప్రజలు హాజరు కావాలని ఆయన కోరారు. సిరియా - ఇరాన్ - మిడిల్ ఈస్ట్ లలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వారంతా వేరే దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. భారతీయులు - హైదరాబాద్ వాసులు - ప్రపంచ శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఆ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుల - మత - జాతి భేదాలు విడనాడి.....శాంతి స్థాపన కోసం చేపడుతున్న ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచాన్ని మార్చడానికి - మంచిని పెంపొందించడానికి ఇదొక సువర్ణావకాశమని పాల్ అన్నారు. సమయాభావం వల్ల నేరుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నానని - అందుకే మీడియా మిత్రులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ట్రంప్ - కిమ్ జాంగ్ ఉన్ ల మధ్య తానే సయోధ్య కుదిర్చానని పాల్ చెప్పిన మాటలు మీడియా మిత్రులకు నవ్వు తెప్పించాయి. నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలవాలని చూడడం పాల్ కు అలవాటేనని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాల్ చెప్పిన మాటలు ఫన్నీగా ఉన్నాయని - కామెడీ షో లా ఉందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరి - పాల్ పిలుపు ప్రకారం ఎంతమంది ఆ ర్యాలీలో పాల్గొంటారో అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.