Begin typing your search above and press return to search.
తెలిసినోళ్లనూ కేసీఆర్ లోపలేయించారా?
By: Tupaki Desk | 19 Dec 2016 10:33 AM GMTకొన్ని విషయాల్ని పెద్దగా పట్టించుకోకుండా లైట్ గా ఉన్నట్లు వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మరికొన్ని విషయాల్లో మాత్రం చాలా కరుకుగా ఉంటారు. ఆయన ఎంత కఠినంగా ఉంటారంటే.. ఆయా విషయాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం కలుగజేసుకోవటానికి సైతం ఏమాత్రం ఇష్టపడరని చెబుతారు. స్పష్టమైన కారణం తెలీకున్నా.. కేసీఆర్ కు పేకాట అన్న మాట వింటే చాలు.. ఉగ్రరూపం దాలుస్తారు.
పేకాట మీద ఉక్కుపాదం మోపటమే కాదు.. పేకాట ఆడాలంటే వణుకు పుట్టేలా చేసిన వైనం తెలిసిందే. తమకెంతో మక్కువ ఉండే పేకాట మీద సీఎం అంత కఠినంగా ఉండటం నచ్చని కొన్ని క్లబ్బులకు చెందిన వారు.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వచ్చి.. అర్జీ పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా అందరి ముందు ఆయన శివాలెత్తిన వైనంతో పేకాటపై ఆర్జీ ఇచ్చేందుకు వచ్చిన వారు హడలిపోయారు.
అప్పటి నుంచి కేసీఆర్ దగ్గర పేకాట ముచ్చట తీసుకొచ్చే ధైర్యం ఎవరూ చేయలేదని చెప్పాలి. తాజాగా నయిం ఎన్ కౌంటర్ ఇష్యూ మీద తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం నయిం లాంటి నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించిందని.. అలాంటి పిశాచి నేరస్తుడ్ని పెంచి ప్రోత్సహించింది ఎవరంటూ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అదే సమయంలో.. పేకాట ప్రస్తావనను ఆయన తీసుకొచ్చారు. జీవితాల్ని నాశనం చేసే పేకాట విషయంలో తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని.. హైదరాబాద్ లో పేకాట ఆడేందుకు భయపడే పరిస్థితి తీసుకొచ్చామని.. తనకు తెలిసిన వారు సైతం పేకాట ఆడుతూ పట్టుబడితే.. వారు ఫోన్లు చేస్తే.. లోపలేయమని తాను చెప్పానని.. అంత కఠినంగా తాము ఉన్నామని చెప్పుకొచ్చారు. తనకు తెలిసిన వారినైనా తప్పు చేస్తే.. క్షమించనన్న విషయాన్ని కేసీఆర్ తనదైన శైలిలో చెప్పారని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/