Begin typing your search above and press return to search.
స్టేట్ నుంచి సెంట్రల్ కు !
By: Tupaki Desk | 11 Dec 2018 7:57 AM GMTతెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ఎన్నికలలో ప్రజలు గులాబీకే దండ వేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుంట్ల కవిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో తమ గెలుపుపై టిఆర్ ఎస్ నాయకులకు ఎవ్వరికీ కూడా అనుమానం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం తనకు ఉందని, దీనికి కె చంద్రశేఖర రావు ప్రవేశ పెట్టిన పలు పథకాలు - వివిధ ప్రాజెక్టులే కారణమని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా తమ పార్టీపై వ్యతిరేకత లేదని - విపక్షాలు తమ పార్టీపై ఎంత వ్యతిరేకత పెంచినా కూడా తెలంగాణ ప్రజలు తమ పార్టీకే పట్టం కట్టారని అన్నారు. గత నాలుగున్నరేళ్లుగా తమ నాయకుడు కె. చంద్రశేఖ రావు అధ్వర్యంలో చేసిన పలు పథకాలు - పాలనే కారణమని ఆవిడ అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రగతికే పట్టం కట్టారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజల కోసం పడిన కష్టాన్ని ప్రజలు గుర్తించారు అని కవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చాణక్యం ప్రజల తీర్పు ముందర పటాపంచలైపోయిందని కవిత అన్నారు. తెలంగాణలో తమ పార్టీ గెలుపుపై తాము మొదటి నుంచి కూడా చాలా ధీమాగా ఉన్నామని - తెలంగాణ ప్రజలు తమ నాయకుడు 2014 ఎన్నికలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు కాబట్టే, తిరిగి ప్రజలు ఆయన పాలననే కోరుకున్నారని కవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి - తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టడానికి ప్రయత్నించారని - అందుకు తెలంగాణ ప్రజలు బాగా బుద్ది చెప్పారని కవిత అన్నారు. రాబోయే రోజులలో కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పుతారని - భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర రాజకీయాలలో మార్పులు తీసుకునే వచ్చే దిశగా అడుగులు వేస్తారని కవిత అన్నారు.