Begin typing your search above and press return to search.
కేసీఆర్ కొంప ముంచుతున్న పెద్ద మనుషులు
By: Tupaki Desk | 10 Jun 2017 7:22 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆయన నమ్మి పిలిచి పెద్ద పదవులు కట్టబెట్టినవారు - ప్రియమిత్రులే తలనొప్పులు తెస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ సర్కారుకు తలవంపులు తెస్తున్న మియాపూర్ భూముల వివాదంలో తాజాగా టీఆరెస్ పెద్ద తలకాయల పేర్లు వినిపిస్తుండడంతో కేసీఆర్ మండిపడుతున్నట్లు సమాచారం. కేసీఆర్ ప్రియమిత్రుడు దామోదరరావు - డిప్యూటీ సీఎం మహమూద్ అలీల పేర్లు ఇప్పటికే ఇందులో వినిపిస్తుండగా తాజాగా టీఆరెస్ జనరల్ సెక్రటరీ - ఎంపీ కేకే కుటుంబం ఈ వివాదంలో చిక్కుకోవడం తలనొప్పులను మరింత పెంచుతోంది.
ఇబ్రహీం పట్నం దండు మైలారంలో గోల్డ్ స్టోన్ కంపెనీ నకిలీ జీపీఏతో కబ్జా చేసిన భూకుంభకోణంలో భూములను టీఆర్ ఎస్ సీనియర్ నేత - ఎంపీ కేకే కుటుంబం కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. దండుమైలారంలో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి 50 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, అందులో 38 ఎకరాలు గోల్డ్ స్టోన్ కబ్జా చేసినవే కావడం విశేషం. 2015 నుంచి ఈ భూములు వివాదాస్పద భూములుగా వ్యాజ్యం నడుస్తుండగా, గద్వాల విజయలక్ష్మి - జ్యోత్స్న - నవజ్యోతి పేరుతో 50 ఎకరాలు కోనుగోలు చేసి రిజిస్టర్ చేయడం గమనార్హం.
ఇవి ప్రభుత్వ భూములని - రిజిస్ట్రేషన్లు అక్రమమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అంతే కాకుండా ఈ భూములను అక్రమంలో రిజిస్టర్ చేసిన ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ ఖాదిర్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈ ముగ్గురు మహిళలు కేకే కుటుంబ సభ్యులే. అయితే.. కేకే దీనిపై మాట్లాడుతూ, ఆ భూములను తమ కుటుంబ సభ్యులు కొనుగోలు చేయడం వాస్తవేమన్నారు. అందుకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, తాము చట్టప్రకారమే భూములు కొనుగోలు చేశామని ఆయన చెప్పారు. అయితే, వివాదంలో ఉన్న భూములను మాత్రం తాము కొనలేదని చెప్పారు. తాను కొన్న భూములు ప్రభుత్వానికి చెందినవి కాదనే విషయాన్ని సీసీఎల్ ఏ స్పష్టం చేసిందని తెలిపారు. దీనికి సంబంధించి హైకోర్టు ఆర్డర్ కూడా ఉందని వెల్లడించారు. తాను కొన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ కలెక్టర్ ఉత్వర్వులు కూడా ఉన్నాయని... కలెక్టర్ ఉత్తర్వులు తప్పయితే కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
కానీ... మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు కేకే అసహనం చెందడం చూసినవారంతా ఇందులో ఏదో లొసుగు ఉందనే అంటున్నారు. 'గోల్డ్ స్టోన్ పార్థసారధి ఎలాంటివాడో తెలియదా?' అని ఓ మీడియా ప్రతినిధి అడగడంతో కేకే సహనం కోల్పోయారు. 'నేనేమన్నా బిచ్చగాడనుకున్నావా? బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా కొనడానికి?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మీడియా ప్రతినిధి మళ్లీ ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో....'నేనేం చెప్తున్నానో అర్ధం చేసుకోండి...నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను' అంటూ మండిపడ్డారు. తరువాత 'రిజిస్ట్రార్ పెద్దా? సుప్రీంకోర్టు పెద్దా? చట్టాలు చేసే రాజ్యసభ సభ్యుడిని నాకు తెలియదా?' అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇందులో వివాదం ఏమీ లేదని, తాము సుప్రీంకోర్టు సూచనలతో రిజిస్టర్ చేయించామని, దీనిపై ఏవైనా వివాదం వస్తే....కోర్టు తీర్పు ధిక్కరణ కేసు వేస్తానని కూడా ఆయన హెచ్చరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/