Begin typing your search above and press return to search.
మోడీకి, కేసీఆర్ కు ఒకటే కామెంట్ వచ్చిందోచ్
By: Tupaki Desk | 30 Nov 2016 7:41 AM GMTకొద్దికాలం క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడీని దేవదూత అని పేర్కొంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రశంస గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అచ్చంగా అలాంటి కితాబునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొందారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2009 నవంబర్ 29 న కేసీఆర్ చేసిన దీక్షను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ ఎంపీ కె.కేశవ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ని దేవుడి దూతగా అభివర్ణించారు. గాంధీ చేసిన సత్యాగ్రహం ఉద్యమంతో కేసీఆర్ దీక్షను చూడాల్సి ఉందని కే కేశవరావు అన్నారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఉద్యమంలో అమరులైన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఉద్యోగ గర్జన - విద్యార్థులు సంఘాలు ఉద్యమం లో కలిసి తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారని…. 2009లో నవంబర్ - డిసెంబర్ నెలలో జరిగిన ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొన్నారని ఎంపీలు గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో శ్రీకాంతచారి మరణం - ఉస్మానియా లో జరిగిన విద్యార్థి ఉద్యమంతో మొత్తం తెలంగాణ జాగృతం అయ్యిందని అన్ని రంగాల ప్రజలు తమ తమ స్థాయిలో ఉద్యమం లో ముఖ్యభూమిక పోషించారని వెల్లడించారు. దీక్ష చేపట్టిన రోజు పరిస్థితులను గుర్తుచేసిన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీ కాంతరావు కరీంనగర్ లోని తెలంగాణ భవన్ లో అప్పడు యుద్ధం వాతావరణం నెలకొందన్నారు. మానేరు దాటే సరికి కేసీఆర్ కారు తప్ప మరోకారు లేకుండా పోలీసులు వ్యూహం పన్ని పోలీసులు అరెస్టు చేసి పార్లమెంటు సభ్యుడన్న ప్రోటోకాల్ లేకుండా కేసీఆర్ తో ప్రవర్తించారని వివరించారు. కేసీఆర్ దీక్ష విరమించారని అసత్య ప్రచారాలు చేసి - ప్రజల్లో గందరగోళ వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టించారని పేర్కొన్నారు. అన్ని పార్టీల నేతలు కేసీఆర్ దీక్ష విరమించాలని కోరినా పట్టు వదలకుండా కేసీఆర్ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సాధించారని ప్రశంసించారు. 2009, నవంబరు 29 తర్వాత ఉద్యమ స్వరూపం మారిపోయిందని తెలంగాణ వచ్చాడో, కేసీఆర్ చచ్చుడో అన్న నినాదంతో అప్పటి ఉద్యమనేత ఇప్పటి ముఖ్యమంత్రి చేసిన దీక్ష అందరికి ఆదర్శ ప్రాయమని భువనగిరి ఎంపీ భూర నర్సయ్య గౌడ్ అన్నారు.
అనంతరం డి.శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ రాజ్యాంగ బద్ధంగా ఉద్యమాన్ని నడిపించిన తీరు అమోఘమన్నారు. హింస జరగకుండా ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అసాధారణ నేత రాష్ట్రంపై పూర్తి స్థాయి ఆలోచన ఉన్న మేధావి కేసీఆర్ అని తెలిపారు. మరో ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అన్ని ఉద్యమాలల్లో ప్రత్యేకత కలిగింది 2009 నవంబర్ 29 దీక్షేనన్నారు. దీక్ష పై ఆంధ్ర పాలకులు విషం కక్కుతున్న సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆసుపత్రి నుంచే అందరికి ఫోన్ లు చేసి దీక్ష పై అపోహలను తొలగించారని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ వెంట చివరి వరకు నడుస్తామన్న ఎంపీ ఆ రోజు యూనివర్శిటీలో తొలి లాఠీ దెబ్బ నాపైనే పడిందని చెప్పారు. లాఠీ దెబ్బ గాయం కొంతసేపట్లో మానింది, కానీ కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహారదీక్ష చరిత్ర పుటల్లో నిలిచి పోయిందని పేర్కొన్నారు. మరో 20 సంవత్సరాలు తెలంగాణ లో టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన బాల్క సుమన్ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ, నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. చివరగా మాట్లాడిన ఎంపీ కవిత 2009 నవంబర్ 29 అనగానే మొత్తం తెలంగాణ ఉద్యమం కళ్ళ ముందుకు వస్తుందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/