Begin typing your search above and press return to search.

ల‌క్ష్మ‌ణ్ డౌట్‌!... కేసీఆర్ హిందువా? - ముస్లిమా?

By:  Tupaki Desk   |   30 March 2019 11:24 AM GMT
ల‌క్ష్మ‌ణ్ డౌట్‌!... కేసీఆర్ హిందువా? - ముస్లిమా?
X
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుపై ఇప్పుడు ఓ స‌రికొత్త విశ్లేష‌ణ‌ల‌తో పాటు స‌రికొత్త ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. స‌రిగ్గా సార్వ‌త్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ‌లో లోక్ స‌భ పోలింగ్ కు స‌మ‌యం ఆస‌న్న‌మైన వేళ... ఈ త‌ర‌హా విశ్లేష‌ణ‌లు నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోనే హైద‌రాబాద్ లో టీఆర్ ఎస్ నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన బ‌హిరంగ స‌భ వాయిదా ప‌డిపోవ‌డంపై పెద్ద ఎత్తున సెటైర్లు కూడా వ‌చ్చి ప‌డుతున్నాయి. ఇటీవ‌లే ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీతో రెండో ప‌ర్యాయం కూడా అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్‌... లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు చాలా ధైర్యంగానే వెళ‌తార‌న్న విశ్లేష‌ణ‌లు నిన్న‌టిదాకా సాగాయి. అయితే ఎల్బీ స్టేడియం బ‌హిరంగ స‌భ వాయిదా ప‌డ‌గానే... కేసీఆర్ లోని ధైర్యం స్ధానే భ‌యం గూడుక‌ట్టుకుని పోయింద‌న్న కొత్త విశ్లేష‌ణ‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఎంట్రీ ఇచ్చిన బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ కొత్త చ‌ర్చ‌ను లేవ‌నెత్తారు. అస‌లు కేసీఆర్ హిందువా? ముస్లిమా? అంటూ మొద‌లైన ఈ వాద‌న‌పై ఇక ముందు కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌ర‌గ‌నుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

స‌రే ల‌క్ష్మ‌ణ్ వాద‌న ఎలా ఉన్నా... కేసీఆర్ నైజాన్ని గ‌మ‌నించిన ఎవ‌రైనా ఆయ‌న‌ను నిఖార్సైన హిందువుగానే ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే... యాగాలు - యజ్ఞాలు చేయ‌డంలో కేసీఆర్ ను మించిన వారు ఇప్ప‌టిదాకా రాజ‌కీయాల్లో లేర‌నే చెప్పాలి. తెలంగాణ ఉద్యమం చేస్తున్న కాలంలోనే పెద్ద పెద్ద యాగాలు చేసిన కేసీఆర్‌... తెలంగాణ క‌ల సిద్ధించి కొత్త రాష్ట్రానికి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత కేసీఆర్ మ‌రింత పెద్ద యాగాలు చేశారు. ఎర‌వ‌లిలోని త‌న ఫాం హౌస్ కేంద్రంగా నిర్వ‌హించిన యాగం ఎలా జ‌రిగిందో మ‌న‌మంతా చూసిందే. హిందూ సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా... వివిధ ప్రాంతాల నుంచి రుత్విక్కులను ర‌ప్పించి రోజుల త‌ర‌బ‌డి యాగం కొన‌సాగించిన కేసీఆర్‌ను పెద్ద హిందువుగానే ప‌రిగ‌ణించ‌క త‌ప్ప‌దు. అంటే... సిస‌లైన ఆరెస్సెస్ నేత‌గా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి హిందూత్వ‌మంటే ఇదేనంటూ త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేస్తున్న ప్ర‌ధాని మోదీ కంటే కూడా కేసీఆర్ పెద్ద హిందువుగానే ప‌రిగ‌ణించ‌క త‌ప్ప‌దేమో. ఎందుకంటే... నిత్యం జాత‌కాలు - శ‌కునాలు - అప‌శ‌కునాలు చూసుకోనిదే బ‌య‌ట‌కు కాలు కూడా పెట్ట‌డం లేదంటే.. హిందువుగా కేసీఆర్ త‌న‌దైన శైలి హిందూ జీవితాన్నే సాగిస్తున్న‌ట్టే క‌దా. మ‌రి ఈ లెక్క‌న కేసీఆర్‌ కు సాటి రాగ‌ల హిందువు బీజేపీలోనే కాదు... దేశంలోని ఏ పార్టీలోనూ ఉండరన్న వాద‌న కూడా వినిపిస్తోంది.

మ‌రి ఇంత‌టి నిఖార్సైన హిందువును ప‌ట్టుకుని ల‌క్ష్మ‌ణ్‌... కేసీఆర్ ఏకంగా ఓవైసీ కంటే పెద్ద ముస్లిం అని ఎలా వ్యాఖ్యానించారు? నిజ‌మే... ల‌క్ష్మ‌ణ్ ఈ వ్యాఖ్య చేసి పెద్ద చ‌ర్చ‌కే తెర లేపారు. హిందువుని అని చెప్పుకునే కేసీఆర్‌... ముస్లింల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌మిస్తున్నారు. అధికారం చేప‌ట్టాక ముస్లింల‌కు ప్ర‌త్యేకంగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారు. ముస్లిం మైనారిటీ వ‌ర్గానికి చెందిన మ‌హ‌మూద్ అలీని ఏకంగా త‌న కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా నియ‌మించుకున్నారు. అంతేనా... రెండో ద‌ఫా సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టే స‌మ‌యంలో మ‌హమూద్ అలీ ఒక్కరితోనే ప్ర‌మాణం చేయించిన కేసీఆర్‌... మ‌రోమారు అలీని త‌న కేబినెట్ లో చేర్చుకున్నారు. ఈ లెక్క‌న చూసినా... కేసీఆర్ పాల‌న‌లో ముస్లింల‌కు అత్యధిక ప్రాధాన్యం ద‌క్కుతున్న‌ట్టే లెక్క‌. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో కూడా ముస్లింల‌కు ఈ మేర ప్రాధాన్యం ద‌క్క‌లేద‌నే చెప్పాలి.

అంతేనా... పాత‌బ‌స్తీ ప‌హిల్వాన్‌ గా కొన‌సాగుతున్న మ‌జ్లిస్ పార్టీతో క‌లిసి సాగుతున్న కేసీఆర్‌... ఈ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ సీటులో మ‌జ్లిసే గెలవాల‌ని త‌న పార్టీ త‌ర‌ఫున అత్యంత వీక్ కాండిడేట్‌ను నిల‌బెట్టారు. ఈ త‌ర‌హా వైఖ‌రిని ఏమాత్రం దాచుకోని కేసీఆర్‌.... తెలంగాణ‌లోని మొత్తం స్థానాల్లో 16 టీఆర్ ఎస్ వ‌ని - మిగిలిన ఒక్క‌టీ మ‌జ్లిస్‌ కే ద‌క్కాల‌ని కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌జ్లిస్‌ ను కేసీఆర్ అక్కున చేర్చుకున్న‌ట్లే. దీనిని గుర్తు చేస్తూనే కేసీఆర్ ను ఓవైసీ కంటే పెద్ద ముస్లింగా ల‌క్ష్మ‌ణ్ అభివ‌ర్ణించి ఉంటార‌ని చెప్పాలి. ఏదేమైనా త‌న భావాలు, జీవ‌న శైలి మేర‌కు పెద్ద హిందువుగానే కొన‌సాగుతున్న కేసీఆర్‌... పాల‌న‌లో మాత్రం మైనారిటీలుగా - ఆర్థిక క‌ష్టాల్లో చిక్కుకుని నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న ముస్లింల‌కు పెద్ద పీట వేస్తూ పెద్ద ముస్లింగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పాలి. ఈ లెక్క‌న కేసీఆర్ పెద్ద హిందువుతో పాటు పెద్ద ముస్లింగానూ త‌న‌దైన ముద్ర వేసుకున్నార‌ని చెప్పాలి.