Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ లోకి వ‌స్తే టీఆర్ ఎస్ భ‌ర‌తం ఖాయ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   2 April 2019 5:30 PM GMT
ప‌వ‌ర్ లోకి వ‌స్తే టీఆర్ ఎస్ భ‌ర‌తం ఖాయ‌మ‌ట‌!
X
అన్ని రోజులు ఒకేలా ఉండ‌వు.క‌లిసిన‌ప్పుడు న‌వ్వులు.. ప‌క్క‌కు వ‌చ్చిన వెంట‌నే పంచ్ డైలాగులు వేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ నేత‌ల మాట‌ల్లో ప‌వ‌ర్ పెంచేశారు. మొన్న‌టివ‌ర‌కూ ఆచితూచి అన్న‌ట్లుగా క‌మ‌ల‌నాథులు వ్య‌వ‌హ‌రించిప్ప‌టికీ.. ఇటీవ‌ల కాలంలో మోడీని ఉద్దేశించి కేసీఆర్ చేస్తున్న తీవ్ర వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో క‌మ‌ల‌నాథులు సైతం మొహ‌మాటాన్ని వ‌దిలేసిన‌ట్లుగా చెప్పాలి.

మోడీ లాంటి పెద్ద మ‌నిషిని ఉద్దేశించి చ‌వ‌ట‌.. స‌న్నాసి అంటూ కేసీఆర్ చుల‌క‌న చేయ‌టాన్ని క‌మ‌ల‌నాథుల‌కు కోపం తెప్పిస్తోంది. దేశ ప్ర‌ధాని స్థానంలో ఉన్న మోడీని ఉద్దేశించి కేసీఆర్ నోటికి వ‌చ్చిన‌ట్లుగా తిట్ట‌టం ఏమిటి? అని ప్ర‌శ్నిస్తున్నారు దీనికి తోడు తాజాగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ను ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌తో త‌మ విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెంచారు తెలంగాణ బీజేపీ నేత‌లు.

తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో క‌లిసి ఒక స‌భ‌లో మాట్లాడిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కేసీఆర్ కు భారీ వార్నింగ్ ఇచ్చేశారు. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు ప్ర‌త్యామ్నాయ వేదిక‌గా బీజేపీ నిలుస్తుంద‌న్న ఆశాబావాన్ని వ్య‌క్తం చేసిన ల‌క్ష్మ‌ణ్.. తాము తిరిగి ప‌వ‌ర్లోకి వ‌చ్చాక టీఆర్ ఎస్ భ‌ర‌తం ప‌డ‌తామ‌ని చెప్పేశారు. ఈ స్థాయిలో కేసీఆర్ కు ఇంత నేరుగా వార్నింగ్ ఇచ్చింది లేదు. అలాంటిది సాఫ్ట్ గా ఉంటార‌ని చెప్పే ల‌క్ష్మ‌ణ్ ఇంత తీవ్రంగా తిట్టిపోయ‌టం చూస్తే.. రానున్న రోజుల్లో బీజేపీ నేత‌ల నోటి మాట‌ల్లో ఘాటు మ‌రింత పెర‌గ‌టం ఖాయ‌మంటున్నారు.

కారు.. సారు.. ప‌ద‌హారు అని టీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తుంద‌ని.. 16 సీట్ల‌లో త‌మ‌ను గెలిపించాలంటూ ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెట్టాల‌ని విమ‌ర్శించారు. తెలంగాణ స‌రిహ‌ద్దు దాటితే టీఆర్ ఎస్ అన్న‌ది చెల్ల‌ని రూపాయిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు యూపీఏ హ‌యాంలో 11 మెరుపుదాడులు జ‌రిగాయ‌ని చెప్పార‌న్న మాట‌ల్ని ల‌క్ష్మ‌ణ్ త‌ప్పు ప‌ట్టారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌ల మీద నిర‌స‌న తెలిపార‌ని..వాటినే కేసీఆర్ స్ట్ర‌యిక్స్ గా భావిస్తున్నట్లుగా ఎద్దేవా చేశారు.

భార‌త్ జ‌రిపిన మెరుపుదాడులు.. వైమానిక దాడుల‌కు గ‌ర్వ ప‌డాల్సింది పోయి.. కేసీఆర్ కొట్టిపారేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. దేశ సైనికుల మాట‌ల్ని న‌మ్మ‌కుండా.. ఈ దాడుల్లో ఎవ‌రూ చ‌నిపోలేద‌ని ఉగ్ర‌వాది మ‌సూద్ అజ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల్ని కేసీఆర్ న‌మ్ముతున్నార‌న్నారు.

పొర‌పాటున కేసీఆర్ కానీ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళితే.. దేశం ఉగ్ర‌వాదుల‌కు నిల‌యంగా మారుతుంద‌న్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేద‌న్నారు. బారు.. బీరు.. తెలంగాణ స‌ర్కారు పేరుతో తెలంగాణ విరాజిల్లుతోంద‌ని.. ప్ర‌తి గ్రామంలో మంచినీటికి అవ‌కాశం లేకున్నా.. మ‌ద్యం షాపు ఉందంటూ మండిప‌డ్డారు. ఇంత‌కాలం బీజేపీ.. టీఆర్ ఎస్ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం ఉంద‌న్న మాట వినిపించ‌గా.. తాజాగా అందుకు భిన్నంగా తాము ప‌వ‌ర్లోకి వ‌చ్చాక కేసీఆర్ స‌ర్కారు భ‌ర‌తం ప‌డ‌తామ‌ని వ్యాఖ్యానించ‌టం దేనికి నిద‌ర్శ‌న‌మ‌న్నది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.