Begin typing your search above and press return to search.
ఏపీ రాజధాని శంకుస్థాపనకు అంత ఖర్చా..!
By: Tupaki Desk | 27 Sept 2015 11:19 AM ISTనవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కనీవినీ ఎరుగని రీతిలో గ్రాండ్ గా చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. విజయదశమి రోజున జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్టు ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ అమరావతి శంకుస్థాపనకు రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని...ఒక వైపు రాష్ర్టం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఏపీకి గుండెకాయలాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.16 వేల కోట్లు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఏడాది రూ.30 కోట్లకు మించి ఇవ్వడం లేదని..ఈ లెక్కన చూస్తే ఈ ప్రాజెక్టు ఎప్పటకి పూర్తవుతుందని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ర్టంలో వెనకపడిన జిల్లాలకు రూ.50 కోట్లు చొప్పున కేటాయిస్తే ...కనీసం మంచినీటి సమస్య కూడా పరిష్కారం కాదని ఆయన ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయకుండా చివరకు ప్యాకేజీ ఇస్తే చాలన్న నిర్ణయానికి వచ్చేసినట్టు కనిపిస్తోందన్నారు. ఏదేమైనా ప్రభుత్వం రాజధాని శంకుస్థాపనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తుండడంపై ప్రతిపక్షాల నుంచి భారీగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి ప్రభుత్వం ఎలా సమాధానం చెప్పుకుంటుందో చూడాలి.