Begin typing your search above and press return to search.
పీఆర్ ఓగా మారిపోయిన వెంకయ్య
By: Tupaki Desk | 30 Oct 2016 4:26 AM GMTఅమరావతిలో పరిపాలన నగరానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన కామెంట్లపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. గతంలో పదేళ్లు హోదా ఇప్పిస్తానని సన్మానాలు చేయించుకున్న వెంకయ్య ప్రస్తుతం ప్యాకేజీ పేరుతో రెండో కృష్ణుడి అవతారం ఎత్తి సన్మానాలు చేయించుకుంటున్నారని విమర్శించారు. వెంకయ్యనాయుడు ఏం సాధించారని ప్రత్యేక విమానాల్లో వచ్చి మరీ సన్మానాలు చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. అవన్నీ అలా ఉంటే కేంద్ర మంత్రి స్థాయి నుంచి దిగజారి ముఖ్యమంత్రి చంద్రబాబుకి పీఆర్వోగా వెంకయ్య నాయుడు వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
రాష్ట్రంలో పది శాతం మంది కూడా ప్యాకేజీకి ఆమోదం తెలపడం లేదని రామకృష్ణ పేర్కొన్నారు. రాయలసీమ - ఉత్తరాంధ్ర ప్రాంతానికి 2020 వరకు మాత్రమే పన్ను రాయితీలు ప్రకటించడంతో పెద్దగా పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన బిల్లులో న్యాయం జరగలేదని, మేము న్యాయం చేస్తామని చెబుతూ సన్మానాలు చేయించుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. ఒకవేళ వెంకయ్య సన్మానాల్లో నిజాయితీ ఉంటే... రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు - ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్యాకేజీపై రిఫరెండంగా మళ్లీ పోటీ చేయాలని రామకృష్ణ సవాల్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/