Begin typing your search above and press return to search.
రష్యా-ఉక్రెయిన్ యుద్దం.. కేఏ పాల్ కామెంట్స్ ఇవే
By: Tupaki Desk | 26 Feb 2022 8:38 AM GMTకేఏ పాల్ గుర్తున్నారా? గత 2019 ఎన్నికలకు ముందు వచ్చి.. రాష్ట్రంలో హడావుడి చేసిన ఆయన తర్వాత.. పత్తా లేకుండా వెళ్లిపోయారు. గతంలో కరోనా సమయంలో ఒకసారి ఆన్‌లైన్ మాధ్యమాల్లో ప్రజల ముందుకు వచ్చిన ఆయన..తర్వాత.. మళ్లీ కనిపించలేదు. అప్పట్లో కరోనాను నియంత్రించేందుకు ప్రయత్నించానని.. కానీ.. చైనా అడ్డుపడిందని.. అందుకే కరోనా బీభత్సం సృష్టించిందని.. కామెడీ కామెంట్లు చేసి.. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఇక, ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ లైవ్‌లో పాల్ మాట్లాడారు.
సుమారు 35 నిమిషాల పాటు మాట్లాడిన పాల్ అటు రాజకీయ నేతలు ఇటు దేశాధినేతలపై విరుచుకుపడ్డా రు. మరీ ముఖ్యంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు పిచ్చివాడని.. ఆయన చేతకాని పాలనతోనే..ఇప్పుడు యుద్ధం వచ్చిందని పాల్ తేల్చేశారు. మరోవైపు.. రష్యా యుద్ధాన్ని నివారించేందుకు ఆపేందుకు.. తాను శక్తినంతా జోడించి ప్రయత్నించినట్టు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కూడా తాను వార్నింగ్ ఇచ్చానని.. రష్యా యుద్ధానికి దిగితే.. తీవ్ర పరిణామాలు వస్తాయని హెచ్చరించానని పాల్ చెప్పారు.
అయితే.. బైడెన్ తననునమ్మించి మోసం చేశారని.. కనీసం రష్యా కు వెళ్లి అక్కడ చర్చించాలని అనుకు న్నా... బైడెన్ వద్దని.. యుద్ధం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారని.. కానీ.. ఇప్పుడు యుద్ధం జరుగు తోందని.. దీనికి బాధ్యులు ఎవరని పాల్ ప్రశ్నించారు. యుద్ధానికి వ్యతిరేకంగా తాను కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నట్టు చెప్పారు. నాటో దేశాధినేతలతో తాను.. అనేక సందర్భాల్లో ప్రార్ధనల్ల పాల్గొన్నానని.. యుద్ధం వద్దని, సహకరించాలని వారిని విన్నవించానని చెప్పారు.
ఇక, ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు వేలాది మంది చిక్కుకుపోయి.. అన్నార్తులుగా మారారని.. పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇటు మోడీ ప్రభుత్వానికి.. అటు ఇండియాలోని రష్యా దౌత్య కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసి.. విద్యార్థుల రక్షణకు చర్చలు తీసుకోవాలని తాను సుప్రీం కోర్టును కోరినట్టు పాల్ తెలిపారు.
ఈ క్రమంలో రిట్ పిటిషన్ కూడా వేశానని... కానీ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిద్ర పోయార ని.. అందుకే.. ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని.. దీనిని తాను చూస్తూ ఊరుకోబోనని.. తనపై కోర్టు ధిక్కరణ కింద కేసు పెట్టి జైలుకు వెళ్లినా... దేవుని కృప అపారంగా ఉన్న తనను ఎవరూ ఏమీ చేయలేరని పాల్ చెప్పుకొచ్చారు. ఇక, ఏపీలో జగన్‌ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు సంధించారు. ఇక, మూడో కూటమి కోసం.. ప్రయత్నిస్తున్న కేసీఆర్ విఫలమైన రాజకీయాలు చేస్తున్నారని..వీరికి అసలు రాజకీయాలు తెలుసా? అని పాల్ ప్రశ్నించారు.