Begin typing your search above and press return to search.

కేఏ పాల్ కామెడీ.. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆయనేనట?

By:  Tupaki Desk   |   27 April 2022 6:30 AM GMT
కేఏ పాల్ కామెడీ.. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆయనేనట?
X
విభిన్న.. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే కేఏ పాల్ మరోసారి న్యూస్ మేకర్ గా మారారు. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట్ల వైరల్ గా మారాయి. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొడుకు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టకముందే హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు.

అయితే గతంలో హైదరాబాద్ కు ఐటీ కారిడార్ ను తీసుకొచ్చానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అబద్ధమని కేఏ పాల్ మీడియా ఎదుట వాపోయారు. విదేశాల్లో ఎక్కువగా ఉంటూ అప్పుడప్పుడు మీడియాలో కనిపించే పాల్ తాజాగా హైదరాబాద్లో మీడియా ఎదుట ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగామారింది.

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న విధంగా మాటల యుద్ధం సాగుతున్న తరుణంలో ఐటీ మంత్రి కేటీఆర్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాతే అభివృద్ధి సాగిందని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ప్రత్యేక తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీస్తోందని తెలిపారు.

టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ తరుణంలో కేఏ పాల్ కేటీఆర్ కు కౌంటర్ గా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పుట్టకముందే ప్రపంచంలోని బిలియనీర్లను హైదరాబాద్ కు తీసుకొచ్చానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘కేసీఆర్, కేటీఆర్ లకు బిల్ క్లింటన్, బిల్ గేట్స్ పేర్లు విన్నారా..? వారిని హైదరాబాద్ కు తీసుకొచ్చింది నేనే.. కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ పుట్టకముందు 40 సంవత్సరాలలో తెలంగాణను అభివృద్ధి చేసిందిన నేనే.. అప్పుడు రాజీవ్ గాంధీ, పీవీ నరసిహారావు, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లు నా దగ్గరికి వచ్చారని, వందలు, వేల మంది బిలియనీర్లను హైదరాబాద్ కు తీసుకువచ్చి అభివృద్ది చేయించా’

‘సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో ఉచిత చారిటీ సిటీ పెట్టి హైదరాబాద్ అమీర్ పేట్ లో 53 వేల మంది అనాథలు, వితంతువులకు నేను సపోర్టు చేశారు. ఇప్పుడున్న 20, 30 సంవత్సరాల వారికి ఆ విషయాలు తెలియవు. కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసి చూడండి.. నా విలువ ఏంటో తెలుస్తుంది.

అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి బుష్, బిల్ క్లింటన్ లను ఇక్కడి నేనే తీసుకొచ్చా.. జార్జి బుష్, క్లింటన్ వచ్చినప్పుడు కేసీఆర్ పొలిటికల్ రంగంలోకి వచ్చారా..?’ అని అన్నారు. నేను ఇంత అభివృద్ధి చేస్తే తెలంగాణను అవినీతిమయంగా మార్చారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో4 లక్షల 12 కోట్లు అని అన్నారు. 20 లక్షల కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల తెలంగాణగా ఎందుకు మారిందని కేఏ పాల్ ప్రశ్నించారు.