Begin typing your search above and press return to search.

మునుగోడును అమెరికా చేస్తా.. కేఏ పాల్ మళ్లీ ఏసాడు!

By:  Tupaki Desk   |   19 Oct 2022 2:30 PM GMT
మునుగోడును అమెరికా చేస్తా.. కేఏ పాల్ మళ్లీ ఏసాడు!
X
‘ఉంగరానికి ఓటేయండి.. మునుగోడును అమెరికా చేయండి.. ’ అంటూ మన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు.. ప్రముఖ మత ప్రబోధకుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగారు. ప్రచారంలో భాగంగా ఓ హోటల్ కు వెళ్లిన ఆయన స్వయంగా దోసవేసి కాలుస్తూ అక్కడికి వచ్చిన ప్రజలు, యువతను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు.

దోశను సరిగా తిప్పడం, కాల్చడం కూడా రాని కేఏ పాల్ఆపసోపాలు పడుతూ సీరియస్  కామెండీ పంచారు. హోటల్ వద్ద దోశ వేస్తూ ప్రజలను ఓట్లు అడిగాడు. తమను గెలిపిస్తే మునుగోడును అమెరికా చేసి పడేద్దామంటూ అలివికాని హామీలిచ్చారు. ‘మునుగోడులో 7 మండలాలను 7వేల మందికి ఉద్యోగాలిస్తాను. నిరుద్యోగులందరూ కేఏ పాల్ అప్ లో జాయిన్ కావాలని.. తనను ప్రమోట్ చేయాలని.. మునుగోడు అభివృద్ధి చేసి పడేద్దాం.. రెండేళ్లలో 7 వేల మందికి ఉద్యోగాలిస్తాను.’ అని హామీ ఇచ్చారు.

ఇక దోశల బండి వారి ఇద్దరు పిల్లలను సంగారెడ్డిలోని తమ ఇన్ స్టిట్యూటషన్లలో 15 సంవ్సరాలు 15 లక్షల ఫ్రీ ఎడ్యూకేషన్ అందిస్తానని కేఏ పాల్ ప్రకటించారు. ప్రతీ మండలానికి ఒక ఆస్పత్రి, ఒక కాలేజీని ఏర్పాటు చేస్తానని.. రైతులను ఆదుకుంటానని కేఏ పాల్ హామీ ఇచ్చారు.

ఇన్ని చేసే నాకు ఇక్కడ పోటీచేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ నేతలు మద్దతు ఇచ్చి ఉంగరం గుర్తుపై పోటీచేస్తున్న నాకు ఓటు వేసి గెలిపించాలని కేఏ పాల్ పెద్ద కామెడీ పంచారు. వాళ్లకు వాళ్లు వేసుకోకుండా నాకే వేయాలని కోరడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

కేఏ పాల్ కామెడీని భరించలేని కొందరు ‘ఆయన మాట్లాడుతుంటే ‘ఏయ్.. పాల్ .. ఏయ్’ అంటూ ఎద్దేవా చేసేలా కామెంట్స్ చేయడం విశేషం.

మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ కూడా బరిలోకి దిగింది. ఈ పార్టీ నుంచి గద్దర్ ను బరిలోకి దించాడు పాల్. ఆయన నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కేఏ పాల్ వేసిన నామినేషన్ తో బరిలో నిలిచారు. ఇటీవల కేఏ పాల్ ప్రచారాన్ని ప్రారంభించారు. చండూరులో ఎన్నికల ప్రచారం  నిర్వహిస్తుండగా.. బీజేపీ అభ్యర్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ ప్రచారాన్ని నిర్వహించడానికి వచ్చాడు. కోమటిరెడ్డిని చూసిన వెంటనే ఆయన వద్దకు వచ్చిన కేఏ పాల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కోమటిరెడ్డిని తనకే ఓటు వేయాలని కోరడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.