Begin typing your search above and press return to search.

బాల‌య్య‌ - ప‌వ‌న్ .. నా ముందు ఎంత‌?

By:  Tupaki Desk   |   7 Dec 2018 8:50 AM GMT
బాల‌య్య‌ - ప‌వ‌న్ .. నా ముందు ఎంత‌?
X
తెలుగు రాజ‌కీయాలు ఇంత ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయంటే అది కేఏ పాల్ పుణ్య‌మే. న్యూస్ ఛానెల్స్‌ లో కావ‌ల్సినంత ఎంట‌ర్‌ టైన్ మెంట్‌. నిజాలు చెప్పి న‌వ్వులు పూయిస్తున్నాడు కేఏ పాల్‌. ఆయ‌న తాజాగా ప్రెస్‌ క్ల‌బ్‌ లో మీటింగ్ పెట్టి త‌న మాట‌ల‌తో అంద‌రి అటెన్ష‌న్ చూర‌గొన్నారు. పాల్ స్టేట్‌ మెంట్లు రాష్ట్రంలో వైర‌ల్ అవుతున్నాయి.

* బాల‌య్య తెలియ‌దు. ఆ మాట నేను చెబితే ఆ క్లిప్‌ ను 15 ల‌క్ష‌ల మంది చూశార‌ట‌. అదే ఛానెల్లో ప‌వ‌న్ మాట్లాడిన క్లిప్‌ని ఐదారు వేల మంది కూడా చూడ‌టం లేదట‌. అది నా రేంజ్‌.

* నేను ఇండియా వదిలి 30 ఏళ్ల‌య్యింది. ఏంజిలినా జోలిని చూశా - షారుఖ్‌ ఖాన్ ని చూశా. అమితాబ్ బచ్చన్‌ ను చూశా. నేను ఆంధ్రాలో ఉన్నదే తక్కువ. నాకు ఎలా తెలుస్తుంది బాల‌య్య‌ గురించి.

*. నేను బాలకృష్ణను కలవలేదండి.. పేరు విన్నా.. ఆయన యాక్టరా అని అడిగా?. అంతే అది వైర‌ల్ అయిపోయింది.

* జనసేన లాంటి చిన్న పార్టీల మీటింగ్‌ లకు అవకాశం ఇస్తున్నారు. కానీ నా ప్రతి మీటింగ్‌ కి చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడుతోంది.

* 3 - 4 ఓటింగ్ శాతం ఉన్న జనసేనకి అనుమ‌తులు ఇచ్చి ప్ర‌జాశాంతి పార్టీ వంటి పెద్ద పార్టీల‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం ఏంటి? మాకొచ్చే జ‌నాల‌ను అదుపు చేయ‌లేం అనేమో !

* ప్రభుత్వాలు అభివృద్ధి చేయడం లేదు. నేను చేస్తానంటే చేయనివ్వడం లేదు.

* ప్రాణం పోయినా సరే దేశాన్ని విడిచిపెట్టను.

ఈ వ్యాఖ్య‌ల‌తో కేఏపాల్ రాష్ట్రమంతా న‌వ్వుకుంటూ ఉంటే... వీడు ఎక్క‌డ దొరికాడ్రా బాబూ అని జ‌న‌సైనికులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.