Begin typing your search above and press return to search.
పవన్ టార్గెట్.. పాల్ పాలి 'ట్రిక్స్'
By: Tupaki Desk | 21 Nov 2018 9:05 AM GMTకిల్లారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్.. దేశంలోనే ప్రఖ్యాత క్రిస్టియన్ సువార్తకుడు.. ప్రచారకుడిగా అందరికీ చిరపరిచితమైన వ్యక్తి. క్రిస్టియన్ కమ్యూనిటీలో పెద్ద ఎత్తున అభిమానం - అనుచరణ గణం ఉన్న కేఏ పాల్ చేష్టలు - ప్రవర్తన ప్రతిసారి వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. పాల్ మతపరమైన కార్యక్రమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా చాలా క్రియాశీలంగా ఉంటారు.. తాజాగా తెలుగు సినిమా స్టార్ హీరోలు అయిన చిరంజీవి - పవన్ కళ్యాణ్ పై కేఏపాల్ హాట్ కామెంట్ చేశాడు. తనను హైదరాబాద్ లో కలిసిన కొందరు కాపు నేతలతో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం రాజకీయ పరిస్థితి చూస్తే చిరంజీవికి ఆదరణ పడిపోయిందని.. రాబోయే ఎన్నికల తర్వాత పవన్ పరిస్థితి అదే అవుతుందని కేఏల్ పాల్ విమర్శించారు. చిరు - పవన్ ను నమ్ముకుంటే కాపు కమ్యూనిటీకి ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. వచ్చే ఆరు నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలు - ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రజాశాంతి పార్టీ తరుఫున తెలుగు రాష్ట్రాల్లో బరిలోకి దిగబోతున్నట్టు పాల్ ప్రకటించారు. అయితే పాల్ తెలివిగా చిరు - పవన్ లని నేరుగా ప్రస్తావించకుండా ‘అన్న - పని అయిపోయిందని.. రాబోయే ఎన్నికల తర్వాత ‘‘ తమ్ముడికి’’ కూడా రాజకీయ భవిష్యత్ ఉండదని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పాల్ చిరంజీవి ప్రజారాజ్యం - జనసేన పార్టీలను పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు చాలామంది నేతలు వచ్చి పీఆర్పీలో చేరారని.. ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు పీఆర్పీ నేతలు సీటు కోసం పోటీ పడ్డారని పాల్ వివరించారు. కానీ గడిచిన 5 ఏళ్లలో పవన్ జనసేనలోకి కేవలం వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలో మాత్రం దిగ్గజ నేతల వచ్చారని చెప్పుకొచ్చారు. ఇక చాలు బాబు మాకొద్దు ఈ అన్నాదమ్ముల్లు అని కాపులు అంటున్నారని పాల్ ఎద్దేవా చేశారు. జనసేనపై నమ్మకంలేకే తనను కలవడానికి కాపు నేతలు వచ్చారని పాల్ చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యంతో పోల్చితే జనసేనకు బలం లేదని వివరించారు.
ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పై కూడా కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. 2008లో సామాజిక న్యాయమే ఎజెండా చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ లక్ష్యం చేరడంలో పూర్తిగా విఫలమైందని కేఏ పాల్ విమర్శించారు. చిరంజీవి ఒక రాజకీయ పార్టీ మద్దతుతోనే ముందుకు వచ్చారని.. చివరకు అందరూ అనుకున్నట్టే అదే పార్టీలో విలీనం అయ్యాడని పాల్ విమర్శించారు. పార్టీని కాంగ్రెస్ కు అమ్ముకున్నాడని పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరు పేరును నేరుగా ప్రస్తావించకుండా జాగ్రత్తగా ఆయన్ని ఏకిపారేశాడు.
తెలంగాణలో వెనుకబడిన కులాలకు - దళితులకు తోడుగా రాజకీయ పార్టీలు లేవని పాల్ అన్నారు. పార్టీలు ఈ వర్గాలను విస్మరించాయని వివరించారు. తెలంగాణలో పార్టీలకు రెబల్స్ గా బరిలో ఉన్నవారు.. దళితులు - వెనుకబడిన వర్గాల నేతలందరినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పాల్ ప్రకటించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాశాంతి తరుఫున ప్రచారం ప్రారంభిస్తామని.. 6 నెలల్లోనే ప్రజలకు చేరువవుతామని చెప్పుకొచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా రాలేదని.. జనాభాలోని 90శాతం జనాభాకు ప్రతినిధిగా.. బీసీలు - దళితుల అభ్యన్నతి కోసమే ప్రజల్లోకి వస్తున్నట్టు చెప్పారు.
ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో తన ప్రజా శాంతి తరుఫున బడుగు - బలహీన వర్గాలను నిలబెడుతానని పాల్ చెప్పారు. తాను ఎక్కడినుంచి పోటీ చేస్తానో తెలియదన్నారు. పవన్ తో కలవాలని చాలా మంది చెబుతున్నారని.. ఆయన వస్తే కలుపుకొని పోతానని అని వివరించారు.
ఇలా విలక్షణ భాష శైలితో శ్లోకాలు వల్లవేసినట్టుండే పాల్ మళ్లీ మీడియా ముందకొచ్చి హల్ చల్ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల రాజకీయ వాతావరణంలో వేలుపెడుతున్నాడు. ఈ సీరియస్ పాలిటిక్స్ లో ఈయన కామెడీ సీరియస్ కలగలిపిన డైలాగ్స్ ఆసక్తి రేపుతున్నాయి.