Begin typing your search above and press return to search.

నడిరోడ్డుపై రికార్డింగ్ డ్యాన్స్ చేసిన కేఏ పాల్.. వైరల్ వీడియో

By:  Tupaki Desk   |   25 Oct 2022 2:30 PM GMT
నడిరోడ్డుపై రికార్డింగ్ డ్యాన్స్ చేసిన కేఏ పాల్.. వైరల్ వీడియో
X
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు అయిన కేఏ పాల్ కూడా బరిలోకి దిగాడు. మునుగోడులో ఆయన ప్రచారం సీరియస్ కామెడీని పంచుతోంది. పాల్ చేసే చేష్టలు జనాలకు, నేతలకు మంచి ఎంటర్ టైన్ మెంట్ ను పంచుతోంది. మునుగోడులో కేఏ పాల్ వినూత్న రీతిలో ప్రచారాన్ని చేస్తున్నారు.

ఇటీవల చండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. బీజేపీ అభ్యర్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ ప్రచారాన్ని నిర్వహించడానికి వచ్చాడు. కోమటిరెడ్డిని చూసిన వెంటనే ఆయన వద్దకు వచ్చిన కేఏ పాల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కోమటిరెడ్డిని తనకే ఓటు వేయాలని కోరడం విశేషం. గెలుపు రేసులో నంబర్ 1 గా ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డినే తనకు ఓటు వేయాలని కోరిన విధానం అందరినీ నవ్వులు తెప్పించింది.

మునుగోడు హీట్ లో కేఏ పాల్ చేస్తున్న కామెడీ వేశాలు అందరికీ ఊరటనిస్తున్నారు. తనకు ఓటు వేయాలని కోరుతూ ఓటర్లను కోరుతూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. జనాల మధ్య ఏమాత్రం సిగ్గుపడకుండా ఊరమాస్ స్టెప్పులతో కేఏ పాల్ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియో తాజాగా వైరల్ అవుతోంది.

తనకు ఓటు వేసి గెలిపిస్తే మునుగోడును అమెరికాలా అభివృద్ధి చేస్తానంటూ కేఏ పాల్ హామీలు కురిపిస్తున్నారు. తెలంగాణ పాటలకు డ్యాన్సులు చేస్తూ ఓటర్లను తనకు ఓటు వేయాలని కోరుతున్నారు. తెలంగాణ పాటలతో సందడి చేస్తున్నాడు.

ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయా పార్టీల నేతలు చేయిన ఫీట్లు లేవు. ఓపక్కన భారీగా జనాలకు డబ్బులు పంచుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక నేతలు ఇడ్లీ బండి వద్దకు వెళ్లి దోశలు వేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి చండూరులో ఎన్నికల ప్రచారంలో ఇలాగే దోశలు వేశారు. ఇస్త్రీ పెట్టె పట్టుకొని బట్టలను ఇస్త్రీ కూడా చేస్తూ హడావుడి చేశారు.

కేఏ పాల్ అయితే అన్నీ మరిచిపోయి ఐటెం గర్ల్ లా ఏకంగా నడిరోడ్డుమీద రికార్డింగ్ డ్యాన్స్ చేసిపడేశారు. అందరికంటే భిన్నంగా ఓటర్లను ఆకట్టుకుంటున్న పాల్ కు మరి ఏ మాత్రం ఓట్లు పడుతాయో చూడాలి. ఏపీలో ఇవన్నీ చేసినా కూడా కనీసం డిపాజిట్ దక్కలేదు. మరి మునుగోడులో ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.