Begin typing your search above and press return to search.

తెలంగాణ ఫ‌లితాల‌పై కేఏపాల్ సంచ‌ల‌న విశ్లేష‌ణ‌

By:  Tupaki Desk   |   11 Dec 2018 4:18 PM GMT
తెలంగాణ ఫ‌లితాల‌పై కేఏపాల్ సంచ‌ల‌న విశ్లేష‌ణ‌
X
తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై క్రైస్త‌వ మ‌త ప్ర‌బోధ‌కుడు కేఏ పాల్ ఆస‌క్తిక‌ర రీతిలో విశ్లేషించారు. త‌న‌దైన శైలిలో ఈ ఫ‌లితాన్ని విశ్లేషించిన బాబు తెలంగాణ‌లో కాంగ్రెస్‌ - టీడీపీ ఓట‌మికి చంద్రబాబే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ``దేవుని శాపానికి గురైన చంద్రబాబుతో సాన్నిహిత్యమే తెలంగాణా శాసన సభ ఎన్నికలలో మహకూటమి ఘోర పరాజయానికి కారణం. మహిన్వితుడయిన దేవునికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలను - చేస్తున్న కార్యకాలపాలను నేను తీవ్రంగా ఖండిసూనే వున్నాను. నవంబర్‌ 20 నుంచి చీల్చి చెండాడుతున్నాను. దేవుడు - శాంతి - సువార్త - వితంతువులు - అనాథలపట్ల ఆయన దోష పూరితంగా వ్యవహరించారు. ఆ దోషాలలో భాగంగానే డిసెంబర్‌ 8న భీమవరంలో నిర్వహించాల్సిన ‘‘శాంతి మహోత్సవం’’ నిర్వహాణా అనుమతులను కూడా రద్ధు చేయించారు. ఆయన సృష్టిస్తున్న ఆటంకాలను గుర్తించి డిసెంబర్‌ 6న అంటే.... సరిగ్గా చంద్రబాబుకి ఎంతో కీలకమైన తెలంగాణా ఎన్నికల ముందు ప్రజాశాంతి పార్టీ ‘‘శాంతి మహోత్సవం’’ రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయవలసి వచ్చింది. ఆ పత్రికా విలేకరుల సమావేశంలో నా ఆవేదనని - ఆగ్రహాన్ని వ్యక్తం చేశాను. అది తప్పకుండా ఎన్నికల ఫలితాలపై ఎంతో ప్రభావం చూపగలదని రాజకీయ ప్రముఖ విశ్లేషకులు - రాజకీయ పండితులు ఊహించారు.`` అని వెల్ల‌డించారు.

టీఆర్‌ ఎస్‌ 5శాతం అదనంగా అంటే...20 నుంచి 30 సీట్లు పొందగలరని - అది ప్రభుత్వం ఏర్పాటుకు మరింత బలాన్నివ్వగలదని ఆశించామని కేఏ పాల్ వెల్ల‌డించారు. ``చంద్రబాబు ఇప్పటికైనా తప్పిదాన్ని గ్రహించుకోగలరని మా బాధాతప్త హృదయంలో కూడిన ప్రార్థన ద్వారా తెలియజేస్తున్నాను. కేవలం ధనబలం - అహంకారపూరిత వ్యవహారశైలితో అన్నింటా నెగ్గుకురాలేమన్నది చంద్రబాబు నాయుడు ఇకనైనా తెలుసుకుంటారని.... ప్రార్థన బలం ఎంతటిదో గ్రహిస్తారని భావిస్తున్నాను. ఢిల్లీలో ప్రధాని అయిపోయినట్టు ఊహించుకుని చంద్రబాబునాయుడు ఎంతో విర్రవీగుతున్నారు. అది మంచిది కాదు దేవుడున్నాడు. అది ఆయన గ్రహించుకోవాలి. భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు. ఈ విషయం ప్రతీ ఒక్కరూ ప్రతీవారికీ తెలియజేయండి. మా స్నేహం మద్దతుతోనే తెలుగు దేశానికి పూర్వం ఎంతో విజయం చేకూరింది. ఆ విషయం ఆ పార్టీ విస్మరించారు. మహానేతగా - ఎంతో అనుభవజ్ఞునిగా భావించుకుంటున్న చంద్రబాబు నాయుడు నా యొక్క సేవలను దేవుని దీవెనలుగా తీసుకోవడం లేదు. ఇది ఎంతో ప్రభావం చేపగలదు. ఇది అందరూ అందరికీ తెలియజేయాల్సిన అంశం`` అని ఆయ‌న అన్నారు. ``ఇక ఆంధ్రప్రదేశ్‌ లో మా ‘‘మా ప్రజా శాంతి పార్టీ’’ ప్రజలకు అండగా నిలబడటం అనివార్యమయింది. దేవుని ఆజ్ఞతో రాబోయే ఎన్నికల్లో పోటి చేసి... విజయం సాధించి ప్రజల ఆకాంక్షలను నేరవేరుస్తాం.`` అని అన్నారు.