Begin typing your search above and press return to search.
వేలికో ఉంగరం.. 12 ఉంగరాల కేఏ పాల్.. మునుగోడులో ఓటర్లకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్
By: Tupaki Desk | 3 Nov 2022 9:30 AM GMTగెలుస్తామో లేదోనని ఓ వైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళనగా పోలింగ్ కేంద్రాలు తిరుగుతున్నారు. ఇక ఓటర్లు నిండుగా డబ్బులు తీసుకొని నింపాదిగా ఓటేయడానికి పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. అందరిలోనూ టెన్షన్ కనిపిస్తుంటే.. ఇదే మునుగోడులో స్వతంత్ర్య అభ్యర్థిగా నిలబడ్డ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మత ప్రబోధకుడు కేఏ పాల్ మాత్రం ఇంతటి వేడిలోనూ కామెడీ పండిస్తున్నాడు. మునుగోడులో అభ్యర్థి పోలింగ్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నాడు. చేతిలోని 10 వేళ్లకు 10 ఉంగరాలు ధరించిన ఆయన తన 'గుర్తు' ఉంగరాన్ని ఓటర్లకు తెలిసేలా కామెడీ పండిస్తున్నాడు.పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ కేఏ పాల్ చేస్తున్న కామెడీ విన్యాసాలు నవ్వులు పూయిస్తున్నాయి.
ఓట్లు వేసే పోలింగ్ కేంద్రాలను అభ్యర్థులు పరిశీలించవచ్చు. కానీ మన కే ఏపాల్ మాత్రం తన ఉంగరం గుర్తును ప్రచారం చేసుకునేలా వేళ్లకు అన్నింటికి బంగారు ఉంగరాలు పెట్టుకొని బూత్ లోకి వెళ్లి హల్ చల్ చేస్తున్నారు. దీన్ని గుర్తించిన కొందరు రిపోర్టర్లు ఇదేంటని ప్రశ్నిస్తే.. రూల్స్ బ్రేక్ చేస్తున్నారని గుర్తు చేస్తే.. వాళ్లకు అదిరిపోయేలా కేఏ పాల్ పంచ్ ఇచ్చాడు.
టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు వాళ్ల బయట కార్లలో తిరుగుతున్నారు. అది ఎన్నికల రూల్స్ అతిక్రమించినట్టు కాదా? మరి వాళ్లు కార్లలో కాకుండా సైకిల్ మీద వస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. తాను ఉంగరాలు పెట్టుకుంటే తప్పవుతుందా? అంటూ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజలకు 30వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పిందని.. కాంగ్రెస్ వాళ్లు 1500 ఇచ్చారని.. వాళ్లను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పాల్ ప్రశ్నించారు. ప్రజలు తననే గెలిపిస్తారని ధీమాగా చెబుతున్నాడు.
కేఏ పాల్ అన్ని పోలింగ్ బూత్ లు కవర్ చేసేలా పొద్దున్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఓటర్లకు కామెడీ పంచుతూ నవ్వులు పూయిస్తున్నారు. కేఏ పాల్ తీరు చూసి అధికారులు పోలీసులు అవాక్కవుతున్నారు. పోలింగ్ రోజు కూడా ఈ విన్యాసాలు ఏంటి స్వామీ అంటూ నవ్వుకుంటున్నారు.
కేఏ పాల్ చేతిలోని 10 వేళ్లకు 10 ఉంగరాలు ధరించి పోలింగ్ కేంద్రాల్లో పరుగులు పెడుతు్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.