Begin typing your search above and press return to search.

ప్ర‌చారంలో కేఏ పాల్ చైన్ చోరీ?

By:  Tupaki Desk   |   27 March 2019 6:15 AM GMT
ప్ర‌చారంలో కేఏ పాల్ చైన్ చోరీ?
X
ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు చంద్ర‌బాబు.. జ‌గ‌న్‌.. ప‌వ‌న్ తోపాటు మ‌రో పేరు అదే ప‌నిగా వినిపిస్తోంది. అవును.. ఆయ‌నే ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. త‌న ముందు బాబు.. జ‌గ‌న్ ఎంత‌? అంటూ సింఫుల్ గా తేల్చేయ‌ట‌మే కాదు.. తానే ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో పాల్ న‌వ్వు పుట్టిస్తున్నారు.

మాట‌ల మంట‌ల‌తో వేడెక్కిపోతున్న ఏపీ రాజ‌కీయాల్లో పాల్ అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న మాట‌లు.. ప్ర‌త్య‌ర్థుల‌పై ఆయ‌న వేసే స‌టైర్ల‌తో బోలెడండ వినోదంగా మారుతున్న ప‌రిస్థితి. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తి ఏమంటే.. యూట్యూబ్‌లో పాల్ కు సంబంధించిన వీడియోక్లిప్పులు చూస్తే.. అత్య‌ధిక వీక్ష‌కులు చూస్తున్న వైనం క‌నిపిస్తుంది.

న‌ర‌సాపురంతో పాటు భీమ‌వ‌రం బ‌రిలో నిల‌వాల‌ని భావించిన పాల్.. స‌మ‌యానికి నామినేష‌న్లు వేయ‌లేక‌పోయారు. ఆయ‌న త‌న నామినేష‌న్ ను దాఖ‌లు చేసేస‌మ‌యానికి టైం పూర్తి కావ‌టంతో ఆయ‌న నామినేష‌న్ ను అధికారులు అంగీక‌రించలేదు. అయిన‌ప్ప‌టికీ తాను న‌ర‌సాపురంలో త‌న స‌త్తా ఏమిటో చూపిస్తాన‌ని చెప్పారు.

మీడియాతో మాట్లాడే స‌మ‌యంలో ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. పాల్ కు ఆయ‌న అభిమానులు పూల‌దండ‌ల‌తో ముంచెత్త‌గా.. మీడియాతో ఆయ‌న మాట్లాడే వేళ‌.. ఆయ‌నకు వేసిన పూల‌దండ‌ల్ని ఒక్కొక్క‌టిగా తీశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మెడ‌లో ఉన్న బంగారు చైన్ మిస్ కావ‌టం క‌నిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ గా మారింది.

అయితే.. పాల్ మెడ‌లో ఉన్న బంగారుచైన్ ను దొంగ‌లించారా? లేదా? అన్న విష‌యంపై అస్ప‌ష్ట‌త ఉంది. వీడియోను చూసిన‌ప్పుడు మెడ‌లో పూల‌దండ‌ల‌తో పాటు బంగారుచైన్ క‌నిపిస్తుంది. పూల‌దండ‌లు తీసేసిన త‌ర్వాత మెడలో ఉండాల్సిన బంగారుచైన్ క‌నిపించ‌దు. అయితే.. అది బంగారు చైన్ కాద‌ని.. పూల‌దండ‌ల‌కు చుట్టూ వెండి తీగ‌గా కొంద‌రు చెబుతున్నారు. అయితే.. ఈ వీడియోను చూసిన అత్య‌ధికులు మాత్రం పాల్ మెడ‌లో బంగారు చైన్ చోరీకి గురైంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న పాల్ కు క‌నీస సెక్యురిటీ ఏర్పాటు చేయ‌రా? అంటూ ఆన్ లైన్ లో కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.