Begin typing your search above and press return to search.
షర్మిల కంటే కేఏ పాల్ కూడా ఫాస్టే
By: Tupaki Desk | 6 Aug 2022 7:47 AM GMTఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేయటంతో ఎన్నికల హీట్ పెరిగిపోయింది.
ఉపఎన్నిక జరుగుతుందనే అంచనాతో అన్నీపార్టీలు అభ్యర్ధుల ఎంపికలో బిజిబిజీగా సమావేశాలు పెట్టుకుంటున్నాయి. బీజేపీ అభ్యర్ధిగా రాజగోపాల్ పోటీచేస్తాడనటంలో సందేహంలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉన్నాయి.
ఈ నేపధ్యంలోనే ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తమ పార్టీ అభ్యర్ధిని శనివారం ప్రకటిస్తానని చెప్పారు. కేఏ పాల్ కూడా ఉపఎన్నికలకు రెడీ అయిపోతుంటే మరి కాబోయే ముఖ్యమంత్రిని తానే అని ప్రకటించుకున్న వైఎస్ షర్మిల ఏమి చేస్తున్నారు ? వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలిగా షర్మిల తెలంగాణా అంతటా పాదయాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు మద్దతుదారులు, అభిమానులు తెలంగాణాలో ఎక్కువగా ఉన్నారు.
వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారని అంచనా. కాబట్టి రేపటి ఉపఎన్నిక జరగబోయేది నల్గొండ జిల్లాలోనే.
కాబట్టి తమ పార్టీ తరపున షర్మిల అభ్యర్ధిని పోటీలోకి దింపుతారా లేదా అనే విషయమై చర్చ జరుగుతోంది. వైఎస్సార్టీపీ తరపున అభ్యర్ధిని కచ్చితంగా పోటీకి దించాల్సిందే అని వైఎస్సార్ అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
పోటీచేయటమంటే ఏదో 10 వేల రూపాయలు డిపాజిట్ కట్టేసి నామినేషన్ వేయటంకాదు. కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. మునుగోడు ఓసీ నియోజకవర్గమే కాబట్టి తక్కువలో తక్కువ 60 కోట్ల రూపాయలన్నా అవుతుంది. పైగా ఎలాగైనా గెలిచి తీరాలని రాజగోపాల్ తో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ పంతాలతో ఉన్నాయి. ఈలెక్కన ఎంతఖర్చవుతుందో ఎవరు అంచనావేయలేరు. ఈ మధ్యనే జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యిందని ప్రచారం అందరికీ తెలిసిందే. కాబట్టి షర్మిల ఏమిచేస్తారో చూడాల్సిందే.