Begin typing your search above and press return to search.
కేఏ పాల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాయ్ బలాయ్.. వైరల్
By: Tupaki Desk | 17 Oct 2022 5:30 PM GMTమునుగోడు ఎన్నికల్లో ఈరోజు చిత్రవిచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రచారంలో ఎదురుపడిన బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని.. గెలిపించాలని.. గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తా.. నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం విశేషం.
ఈ ఆఫర్ చూసి ఖంగుతినడం రాజగోపాల్ రెడ్డి వంతు అయ్యింది. తన గెలుపు కోసం తను కృషి చేస్తుంటే తననే మద్దతు అడిగిన కేఏ పాల్ వ్యవహారం చూూసి ఎలా స్పందించాలో తెలియక రాజగోపాల్ రెడ్డి భిక్కమొహం వేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ కూడా బరిలోకి దిగింది. ఈ పార్టీ నుంచి గద్దర్ ను బరిలోకి దించాడు పాల్. ఆయన నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కేఏ పాల్ వేసిన నామినేషన్ తో బరిలో నిలిచారు.తాజాగా కేఏ పాల్ ప్రచారాన్ని ప్రారంభించారు. చండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో బీజేపీ అభ్యర్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ ప్రచారాన్ని నిర్వహించడానికి వచ్చాడు. కోమటిరెడ్డిని చూసిన వెంటనే ఆయన వద్దకు వచ్చిన కేఏ పాల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డికి ఒక విన్నపాన్ని కేఏ పాల్ చేశాడు. ‘తనకు మద్దతు ను ఇవ్వాలని.. మునుగోడులో గెలిపిస్తే 60 నెలల్లో ఎవరూ చేయలేనంత అభివృద్ధి చేస్తానని .. మునుగోడును అమెరికా చేస్తానని’ కోరారు. దీనికి నవ్వి ఊరుకోవడం రాజగోపాల్ రెడ్డి వంతైంది.
ఇక కేఏ పాల్ ను చూసిన వెంటనే బీజేపీ కార్యకర్తలు జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. కేఏ పాల్ కూడా బీజేపీ శ్రేణులతో కలిసి కాసేపు నడిచారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లు ఓట్లు కొంటున్నాయని.. తనను గెలిపిస్తే మునుగోడును ఆరు నెలల్లోనే 7వేల మందికి ఉద్యోగాలు కల్పించి అభివృద్ధి చేస్తానన్నారు. హైదరాబాద్ ఒకప్పుడు అడవిగా ఉంటే తానే అభివృద్ధి చేశానంటూ పాల్ గొప్పలకు పోయాడు.
ఇలా మునుగోడు వేడిలో కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చి కావాల్సినంత కామెడీని పంచేస్తున్నాడు. దీన్ని ఎంజాయ్ చేస్తూ నేతలంతా కాస్త రిలాక్స్ అవుతున్న పరిస్థితి నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.