Begin typing your search above and press return to search.
కేఏ పాల్ ఎన్నికల గుర్తు.. చెప్పుకోండి చూద్దాం
By: Tupaki Desk | 14 Feb 2019 10:40 AM GMTకేఏ పాల్.. ఆయన ఆధ్యాత్మిక బోధకుడిగా అందరికీ తెలుసు. అంతేకాదు.. ఆయనకు ఓ రాజకీయ పార్టీ కూడా ఉంది. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడిగా ఏపీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి రెడీ అయ్యారు. ఆయన ఆవేశం.. ఆక్రోషం.. కాస్తా కామెడీ అయిపోయి ఈ మధ్య జనాలకు ఎంటర్ టైన్ మెంట్ ను పంచుతోంది. ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు కేఏ పాల్ చేసిన ప్రకటన చూసి అందరూ నవ్వుకున్నారు. కానీ ఆయన మాత్రం బాబును ఓడించి తన అసిస్టెంట్ గా పెట్టుకున్నానన్నాడు. జగన్ గెలవడని..పవన్ కు అంత సీన్ లేదని చెప్పుకొచ్చాడు.
ఈ మధ్య పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ కేఏపాల్ సందడి చేస్తున్నాడు. తాజాగా ఓ లేటెస్ట్ వీడియోతో కేఏపాల్ మన ముందుకు వచ్చాడు. ఆయన ఏపీ రాజకీయాల్లో పోటీచేసేందుకు వీలుగా ప్రజాశాంతి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఒక గుర్తును కేటాయించిందని తెలిపారు. అయితే ఆ గుర్తు ఏంటో మాత్రం ఆయన సస్పెన్స్ లో పెట్టారు. 2008 లో స్థాపించిన తన పార్టీకి తాజాగా ఫిబ్రవరి 13న కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు కేటాయించిందని.. అదేంటో చెప్పుకోండి చూద్దాం అంటూ కేఏ పాల్ ప్రజలను కోరారు.
ఈ వీడియో మొదట్లో ఆయన ఏపీలోని ప్రధాన పార్టీల గుర్తులను హేళన చేస్తూ మాట్లాడారు.. జనసేన గ్లాస్ పగిలిపోతుందని.. వైసీపీ ఫ్యాన్ కిందపడి అక్కరకు రాకుండా పోతుందని.. టీడీపీ సైకిల్ తుప్పు పట్టి పాడైపోతుందని కొన్ని వీడియోలను ఉదాహరణగా చూపించి ఎండగట్టారు. కానీ తన గుర్తు మాత్రం ఎవర్ గ్రీన్ అంటూ మూడు హింట్స్ ఇచ్చాడు. ఏరోప్లేన్, హెలీక్యాప్టర్, కన్ను.. ఈ మూడు గుర్తుల్లో ఒక ప్రజాశాంతి పార్టీ గుర్తు అని చెప్పుకోండి అంటూ ప్రజలను కోరారు. ఇప్పుడు కేఏ పాల్ విసిరిన గుర్తులాట ఆసక్తిగా మారింది..