Begin typing your search above and press return to search.

కేఏ పాల్ మళ్లీ రంగంలోకి.. తెలంగాణలో షర్మిల అవసరమే లేదట?

By:  Tupaki Desk   |   3 Dec 2022 4:29 AM GMT
కేఏ పాల్ మళ్లీ రంగంలోకి.. తెలంగాణలో షర్మిల అవసరమే లేదట?
X
కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ వాలిపోతారు. 2019 ఏపీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరుఫున పోటీచేశారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఆయన స్వంతంత్ర అభ్యర్థిగి నిలిచారు. ఎన్నికలు అయిపోగానే పెట్టా బేడా సర్దుకొని అమెరికా వెళ్లిపోతాడు. కేఏ పాల్ రాజకీయమే అంతా సీరియస్ పాలిటిక్స్ గా ఉంటుంది.

తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని మావెరిక్ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్‌లో కేఏ పాల్ విలేకరులతో మాట్లాడుతూ.. అధికారాన్ని దృష్టిలో పెట్టుకుని షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.

రాజశేఖర్ రెడ్డికి రాష్ట్రానికి సంబంధం లేదని, తెలంగాణ ప్రజలకు ఇక్కడ రాజన్న రాజ్యం అవసరం లేదని ఆయన అన్నారు.

షర్మిల సోదరుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేశారని, ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజన్న రాజ్యం తెస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని పాల్ అన్నారు.

అయితే ఏపీలో జగన్ క్రూరమైన నియంతృత్వ పాలనను తీసుకొచ్చారన్నారు. షర్మిల కూడా తన అన్న అడుగుజాడల్లో నడుస్తోందని, తెలంగాణలో తన సోదరుడి పాలనను పునరావృతం చేయాలనుకుంటున్నారా అని కేఏ పాల్ నిలదీశారు.

తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పాల్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి తనకు చాలా సమయం ఉందని అన్నారు.

మొత్తంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచే కాదు.. ఆఖరుకు కేఏ పాల్ నుంచి కూడా షర్మిలపై కౌంటర్లు పడుతుండడం విశేషంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.