Begin typing your search above and press return to search.
పాల్ సంచలనం: నాతో టచ్ లో జాతీయ నాయకులు
By: Tupaki Desk | 25 Dec 2018 5:32 PM GMTప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోమారు తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుపై పాల్ మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజలకు కాంట్రవర్సీలు క్రియేట్ చేసి తాను గొప్ప అంటే తాను గొప్ప అని తిరుగుతున్నారని పాల్ విమర్శించారు. తెలంగాణలో కంటే ఏపీలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. అన్నింటిలో మేమే నెంబర్ 1 అని చంద్రబాబు అంటుంటారని.. క్రైమ్ లో నెంబర్ వన్నా? అని పాల్ ఎద్దేవా చేశారు. ఏపీలో రోడ్లు లేవు - హాస్పిటళ్లు లేవు - ప్రజలకు తిండి లేదు అని పాల్ వాపోయారు. ఏపీలో ఎవరికీ రక్షణ లేదని చిటపటలాడారు. ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ లేదని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణే చెప్పారని పాల్ గుర్తు చేశారు.
ఇక తెలుగురాష్ర్టాల సీఎంలు జపిస్తున్న జాతీయ రాజకీయాల గురించి కూడా కూడా కేఏ పాల్ స్పందించారు. దేశ రాజకీయాల్లో ఉన్నవారందరిదీ సేవ్ సెక్యులర్ ఇండియా స్లోగన్ అని అన్నారు. థర్డ్ ఫ్రంట్ లోని పెద్ద పెద్ద నాయకులు తనతో టచ్ లో ఉన్నారని - తనను ప్రత్యేకంగా కలుస్తున్నారని పాల్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే 6 పెద్ద పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించానని పాల్ చెప్పారు. ఇద్దరు సీఎంలకు పోటీగా పాల్ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారా? అనే చర్చ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో మొదలవడం కొసమెరుపు.