Begin typing your search above and press return to search.

కాకినాడ‌లో కేఏపాల్ ప‌ర్య‌ట‌న ర‌చ్చ ర‌చ్చ రీజ‌నేంటంటే!

By:  Tupaki Desk   |   28 July 2022 12:30 PM GMT
కాకినాడ‌లో కేఏపాల్ ప‌ర్య‌ట‌న ర‌చ్చ ర‌చ్చ రీజ‌నేంటంటే!
X
ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌పంచ శాంతిదూత‌గా పేర్కొనే.. కేఏ పాల్‌.. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా లోని కాకినాడ‌లో ప‌ర్య‌టించారు. అయితే, పాల్ ప‌ర్య‌ట‌న ఆద్యంతం కూడా ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారింది. దీనికి కార‌ణం.. పాల్ త‌మ‌కు అప్పు ఉన్నార‌ని.. ల‌క్ష‌ల్లో సొమ్ము బాకీ ఉన్నార‌ని.. అందుకే ఆయ‌న కార్లు జ‌ప్తు చేసుకున్నామ‌ని.. కొంద‌రు వ్యాఖ్యానించ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. పాల్ మొత్తం ఐదు భారీ వాహ‌నాల్లో కాకినాడ‌కు వ‌చ్చారు. అయితే.. వీటిలోరెండింటిని.. గురువారం అర్ధరాత్రి కొంద‌రు తీసుకువెళ్లారు.

ఏం జ‌రిగిందంటే.

కాకినాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతు న్నాయి. నిన్న రాత్రి స్థానిక స్కూల్లో పాల్ తన వాహనాలను పార్కింగ్ చేశారు. అయితే గురువారం ఉదయానికల్లా ఐదు వాహనాల్లో రెండు వాహనాలను కొందరు స్వాధీనం చేసుకున్నారు. పాల్ తమకు డబ్బులు అప్పు ఉన్నార‌ని.. ఆ సొమ్ములు ఇవ్వాలని అందుకే వాహనాలు తీసుకున్నామని చెబుతున్నారు.

కేఏ పాల్ బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్త యాత్రను కాకినాడ నుంచి ప్రారంభించారు. అడుగడుగునా పోలీసులు ఆటంకాలు కల్పించినప్పటికీ పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

గురువారం ఏలూరు వెళ్లేందుకు తన కాన్వాయ్‌ల కోసం ఎదురు చేస్తుండగా.. ఐదు వాహనాల్లో రెండు వాహనాలు కనిపించలేదు. సీపీఎంసీ విద్యా సంస్థకు చెందిన రత్నాకర్‌కు కేఏ పాల్ డబ్బులు బాకీ ఉన్న నేపథ్యంలో రత్నాకర్ అనుచరులు పాల్‌కు చెందిన రెండు వాహనలు తీసుకుపోయారు.

దీంతో పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్లు విడిపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పాల్ తనకు డబ్బులు ఇవ్వాలని ఇచ్చిన తర్వాతే వాహనాలు తీసుకువెళ్లాలని రత్నాకర్ చెప్పారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తరచుగా పాల్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తామే ఈ వాహనాలను తీసుకువెళ్లామని జనసేన నేతలు ప్రకటించారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. మ‌రి దీనిపై పాల్ ఏమంటారో చూడాలి.