Begin typing your search above and press return to search.

ఇమ్యూనిటీ పెంచే కబాసురా కుదినీరు.. అందరూ తీసుకోవచ్చా?

By:  Tupaki Desk   |   24 May 2021 11:30 PM GMT
ఇమ్యూనిటీ పెంచే కబాసురా కుదినీరు.. అందరూ తీసుకోవచ్చా?
X
కరోనా కాలంలో అందరికీ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎవరికి తెలిసిన చిట్కాలు వారు ఉపయోగిస్తున్నారు. కొవిడ్ నుంచి ఉపశమనం పొందడానికి కబాసురా కుదినీరు చాలా ఉపయోగపడుతుందని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ సమ్మేళనంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ చూర్ణం పొడి దగ్గు, జలుబు, శ్వాసకోస సంబంధ వ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుందని రెడీ టు డ్రింక్ నిపుణులు తెలిపారు.

ఇది ఇమ్యూనిటీ బూస్టర్, అనాల్జేసిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనోమోడ్యులేటరీ గుణాలను కలిగి ఉంటుందని చెప్పారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ చూర్ణం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, ప్రయోజనాలు, దుష్ప్రభావాలను తెలుసుకుందాం రండి...

కావాల్సిన పదార్థాలు
అల్లం ముక్క
హైపర్ లాంగమ్(పిప్పాలి)
లవంగం
దుస్పర్ష
అకరకర్బా
కోకిలక్షహరితాకి
మలబార్ నట్
అజ్వైన్
గుడిచి
కుస్తా
భారంగి
కలమేఘ
రాజా పటా
ముస్తా
నీరు

తయారీ విధానం
పై పదార్థాలను తేమ పోయేంతవరకు పూర్తిగా ఎండబెట్టాలి. ఎండిన పదార్థాలను నీటిలో వేసి మరగబెట్టాలి. ఎనిమిదో వంతు నీరు తగ్గే వరకు మరిగించాలి. తర్వాత పలుచని వస్త్రం సాయంతో ఈ ద్రావణాన్ని వడగట్టాలి. దీనిని మూడు గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. అంతే కబాసురా కుదినీరు తయారైనట్లే.

ప్రయోజనాలు
కబాసురా కుదినీరు ఒక సిద్ధ ఔషధం. వివిధ రకాల మూలికలతో దీనిని తయారు చేస్తారు. వాటిలో వేటికవే ప్రత్యేకమైన గుణాలను కలిగి ఉన్నాయి. సహజమైన పదార్థాలు శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగిస్తాయని నిపుణులు అంటున్నారు. ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా శ్వాస వ్యవస్థను మెరుగుపరుస్తుందని తెలిపారు. అంటు వ్యాధులకు చికిత్స చేయడానికి ఈ చూర్ణం చక్కగా ఉపయోగపడుతుందని వెల్లడించారు.

దుష్ప్రభావాలు
మూలికా సంబంధమైన చూర్ణం కాబట్టి అందరికీ ఒకేలా పడవు. కొందరి శరీరాన్ని బట్టి ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చూర్ణం విషయానికొస్తే ఎటువంటి దుష్ర్పభావాలు లేవని రెడీ టు డ్రింక్ నిపుణులు తెలిపారు. కానీ సిద్ధ వైద్యులను సంప్రదించడం మేలు అని చెబుతున్నారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలతో పాటు ఖనిజాలు, విటమిన్లు ఉంటాయని వెల్లడించారు.