Begin typing your search above and press return to search.
రాజంపేట టీడీపీదే.. రాసిపెట్టుకో: తమ్ముళ్లు..!
By: Tupaki Desk | 29 July 2022 4:10 AM GMTవైసీపీ అధినేత, సీఎం జగన్ సొంత జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం రాజంపేట. ప్రస్తుతం ఇక్కడ నుంచి మేడా మల్లికార్జున రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం దక్కిం చుకుంది. కడప జిల్లా మొత్తంలో రాజంపేటలోనే టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రాజకీయ పవనాలు.. సంకేతాలు మారుతున్నా యని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచే స్కోప్ ఉందని అంచనాలు వేస్తున్నారు.
ఇదే విషయంపై తమ్ముళ్లు కూడా ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అంతేకాదు.. మరికొందరు అయితే .. టీడీపీ విజయం రాసిపెట్టుకోవచ్చని కూడా చెబుతున్నారు. దీనికి కారణం.. వైసీపీలో ఏర్పడిన విభేదాలు .. ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి గెలిచిన మేడా.. మళ్లీ ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని.. పార్టీలో ఆయన ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. తన మాటను నెగ్గనివ్వడం లేదనేది ప్రధాన విమర్శ.
ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటులో రాజంపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరమీదికి వచ్చి న విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయంలో ప్రభుత్వం మేడా మాటను పక్కన పెట్టింది. ఆయన ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది.
లోక్‌సభ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటను కాదని.. రాయచోటిని జిల్లా కేంద్రం చేశారు. ఇక్కడ జగన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రీకాంత్‌రెడ్డి తన మాట నెగ్గించుకున్నారు. దీంతో రాజంపేట ఎమ్మెల్యే మేడా అలకబూనారనేది అందరికీ తెలిసిందే.
మరోవైపు.. వైసీపీలోనూ.. ఆయన నేతలకు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తన మాటల కు విలువ లేదని.. జిల్లాలో కోటరీ రాజకీయాలు నడుస్తున్నాయని.. చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మేడా.. పార్టీకి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. గడపగడపకు కార్యక్ర మానికి ఆయన అసలు హాజరు కావడమే లేదు.
ఈ పరిణామాలను గమనిస్తున్న వారు..వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి టీడీపీ పంచన చేరుతారని.. టికెట్ కూడా దక్కించుకునే ప్రయత్నాలు చేయొచ్చని చెబుతున్నారు. ఇదిలావుంటే.. టీడీపీలో మాత్రం రాజంపేట జోష్ మరింత పెరిగిందనే చెప్పారు. జిల్లాలో పాగా వేసే.. నియోజకవర్గాల్లో ఇది ఖాయమని నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.